ఆస్ట్రేలియాలో సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్
రాయల్ ఎన్ఫీల్డ్ ఆస్ట్రేలియాలో మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించే దిశలో మెల్‌బోర్న్‌లో ఎక్స్‌క్లూజివ్ స్టోర్ ను ప్రారంభించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఆస్ట్రేలియాలో తమ మొదటి బ్రాండ్ అవుట్‌లెట్ ను మెల్‌బోర్న్‌లో ప్రారంభించింది. ఆస్ట్రేలియా మార్కెట్లో నిరంతర వృద్దిని సాధించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 250-750 సీసీ సామర్థ్యం గల మిడ్ సైజ్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో ప్రముఖ పాత్ర వహిస్తోంది.

ఇండియాకు చెందిన ప్రముఖ ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే కంగారూల గడ్డపై అధికారికంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో రాయల్ ఎన్ఫీల్డ్‌కు ఆస్ట్రేలియా అత్యంత ముఖ్యమైనదని తెలిపాడు. ఆస్ట్రేలియా మార్కెట్లో మంచి వృద్దిని సాధిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఈ నూతన అవుట్ లెట్ సంస్థ భవిష్యత్తులో మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

2016 ఏడాదిలోని మొదటి మూడు ఆర్థిక త్రైమాసికంలో 63 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. అంతకు మునుపటి గణాంకాలతో పోల్చితే భారీ స్థాయిలో అధికంగా నమోదైంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో తమ షోరూమ్‌లను విస్తరించి వినియోగదారులకు సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్ పరంగా మెరుగైన సేవలందించనున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది.

రాయల్ ఎన్ఫీల్డ్ 2018 నాటికి ప్రపంచ వ్యాప్తంగా తమ ఉత్పత్తిని రెట్టింపు చేయాలనే యోచనలో ఉంది. గత ఏడాది 2015 లో రాయల్ ఎన్ఫీల్డ్ 4,50,000 యూనిట్లను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించనుంది. అమ్మకాలను కూడా రెట్టంపు చేయాలని ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా మార్కెట్లోని రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో బుల్లెట్ 500, క్లాసిక్ 500 మరియు 350, కాంటినెన్షియల్ జిటి కేఫ్ రేసర్ 535సీసీ లతో పాటు నూతన అడ్వెంచర్ ఉత్పత్తి హిమాలయన్ 410 వంటి బైకులు అందుబాటులో ఉన్నాయి.

- పాకిస్తాన్ ను చిధ్రం చేయడానికి వీటికి క్షణం చాలు..!!
- కవాసకి నుండి 2017 నాటికి వరుసగా నాలుగు కొత్త బైకులు
- పైలట్లు మరియు ఎయిర్ హోస్టస్ ప్రయాణికులకు తెలియకుండా చేసే చీకటి పనులు


Click it and Unblock the Notifications








