రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ శ్రేణి బైకుల మధ్య పోటి: క్లాసిక్ 350, క్లాసిక్ 500...?
అడవి సింహం ముందు గ్రామ సింహాలు ఎన్ని వచ్చినా వేస్ట్ అని ముక్త కంఠంతో నిరూపించింది రాయల్ ఎన్ఫీల్డ్. చాలా వరకు విదేశీ మోటార్ సైకిళ్లు దేశీయ మార్కెట్లోకి భారీ ఆఫర్లతో వచ్చినప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. మరి దీనికి పోటి ఏముంది అంటే అస్సలు పోటీనే లేదు అని చెప్పవచ్చు.
కాని రాయల్ ఎన్ఫీల్డ్ వారి క్లాసిక్ 350 మరియు క్లాసిక్ 500 బైకులు భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. కొంచెం వ్యత్యాసంతో కాస్త అటు ఇటుగా మంచి అమ్మకాలనే సాధిస్తున్నాయి. అందుకోసం ఈ రెండింటి మధ్య తేడాలు క్రింది కథనంలో.....

డిజైన్ సంగతులు
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ శ్రేణి బైకులు ఈ మధ్య కాలంలో సరికొత్త పుంతలు తొక్కాయి అని చెప్పవచ్చు. గుండ్రటి ఆకారంలో గల ఇంధన ట్యాంకును బాగా డిజైన్ చేశారు. అంతే కాకుండా మన చూపులను వెంటనే ముందు మరియు వెనుక వైపున గల మడ్ గార్డ్స్ మీదకు మల్లించుకునే విధంగా ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.

ప్రక్క వైపుల ఆంగ్లపు వి ఆకారంలో గల బాక్స్‌ను అందించారు. రాయల్ ఎన్ఫీల్డ్ వారు దాదాపుగా 100 సంవత్సరాల నుండి బైకులను ఇండియన్ మార్కెట్లోకి అందిస్తున్నారు. అప్పట్లలో అందించిన ఈ పెట్టెను ఇప్పటిరకీ ఇలాగే అందిస్తూ వస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్‌లోని క్లాసిక్ శ్రేణి బైకులలో హెడ్ లైట్లను మరియు టెయిల్ టెయిల్ లైట్లను గుండ్రటి ఆకారంలో డిజైన్ చేశారు. పాత కాలంలోని నుండి రాబోయే భవిష్యత్తు వరకు రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్ లైట్ మీద వానరం తల గల టోపి ఆకారంలో చిన్నగా చేసిన డిజైన్ ఎంతో అందంగా ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ లోని క్లాసిక్ శ్రేణి బైకులు ప్రస్తుతం ప్రత్యేకమైన డిజైన్ మరియు సింగిల్ సీట్ వంటి ఫీచర్లతో మరియు డిఫరెంట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు డిజన్ పరంగా క్లాసిక్ 350 మరియు క్లాసిక్ 500 బైకులు ఒకే విధంగా ఉన్నప్పటికీ రంగుల పరంగా వేరు వేరు కలర్లలో కలవు.

క్లాసిక్ 350 సాంకేతిక వివరాలు
క్లాసిక్ 350 బైకులో 346 సీసీ కెపాసిటి గల 4-స్ట్రోక్ ట్విన్ స్పార్క్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

క్లాసిక్ 350 పవర్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు
5,250 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 19.8 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంది.

క్లాసిక్ 500 సాంకేతిక వివరాలు
క్లాసిక్ 500 బైకులో 499సీసీ కెపాసిటి గల 4-స్ట్రోక్ ట్విన్ స్పార్క్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

క్లాసిక్ 500 పవర్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు
ఇందులోని ఇంజన్ 5,250 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 27.2 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 41.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.

ఇంధన సరఫరా
క్లాసిక్ 350 లోని ఇంజన్‌కు ట్యాంకు నుండి కాంస్టాంట్ వ్యాక్యుమ్ కార్బోరేటర్ ద్వారా మరియు క్లాసిక్ 500 లోని ఇంజన్‌కు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. 350 శ్రేణి బైకులో ఇగ్నిషన్ కాయిల్ ద్వారా మరియు 500 శ్రేణిలో డిజిటల్ ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది.

ఫీచర్లు
రాయల్ ఎన్ఫీల్డ్ తమ రెండు క్లాసిక్ 350 మరియు క్లాసిక్ 500 లలో ఎటువంటి అదనపు, ప్రత్యేకమైన ఫీచర్లను అందివ్వలేదు. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లు మరియు రెండు ఇంజన్ ఛాయిస్‌లు మినహా మరే ఇతర ఫీచర్లు ఇందులో లేవు.

భద్రత
రెండు బైకులు కూడా ముందు వైపున 280 ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 153 ఎమ్ఎమ్ గల డిస్క్ బ్రేకులను అందించారు.

ధర వివరాలు
రాయల్ ఎన్ఫీల్డ్‌లోని క్లాసిక్ శ్రేణి బైకుల ధరలు రూ. 1.25 లక్షలు నుండి 1.75 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి.ఎంచుకునే రంగును బట్టి కూడా ధరలో మార్పులు ఉంటాయి.

తీర్పు
చక్కటి మైలేజ్ మరియు తక్కువ ధరలో కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకును ఎంచుకోవచ్చు. ఇలా కాకుండా శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్ కావాలి అనుకుంటే క్లాసిక్ 500 బైకును ఎంచుకోగలరు.

- జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికా పైనే అనుమానం..!
- విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
- వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








