ఇండియన్ మార్కెట్లోకి రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ విడుదల ధర రూ. 1.55 లక్షలు

By Anil

రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ 500సీసీ టూ వీలర్ల మార్కెట్లోకి అతి పురాతణమైన మోడల్ అయిన హిమాలయన్ బైకును సరికొత్త హంగులతో హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. 500సీసీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హిమాలయన్ అడ్వెంచర్ టూరర్‌కు చెందిన పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

 ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తమ హిమాలయన్ అడ్వెంచర టూరర్ బైకులో 410సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించింది.

 పవర్ మరియు టార్క్ వివరాలు

పవర్ మరియు టార్క్ వివరాలు

ఈ ఇంజన్ 6,500 ఆర్్‍‌పిఎమ్ వేగం వద్ద 24.5 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 నుండి 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 వైబ్రేషన్స్ ఫ్రీ

వైబ్రేషన్స్ ఫ్రీ

టూరర్ బైకులు అంటేనే విపరీతమైన అదుర్లు మరియు కుదుపులు గుర్తుకువస్తాయి. కాని ఇలాంటి కుదుపులను నియంత్రించడానికి ఇంజన్ చుట్టూ కౌంటర్ బరువులను తగిలించారు. తద్వారా ఇంజన్ నుండి వచ్చే వైబ్రేషన్స్ దాదాపుగా తక్కువగా ఉంటాయి.

 ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్

ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్

ఇంజన్ నుండి విడుదలయ్యే మొత్తం పవర్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ నుండి చైన్ డ్రైవ్ సహాయంతో వెనుక చక్రాలకు అందుతుంది.

సస్పెన్షన్

సస్పెన్షన్

హిమాలయన్ బైకులో ముందు వైపున 200ఎమ్ఎమ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 180 ఎమ్ఎమ్ ట్రావెల్ గల మోనోషాక్ అబ్జార్వర్ కలదు. అత్యధికంగా దీనికి 220 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కల్పించారు.

బ్రేకులు

బ్రేకులు

ముందు వైపున చక్రాన్ని పట్టి ఉంచడానికి 300 ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డిస్క్ బ్రేకు కోసం రెండు పిస్టన్లు గల కాలిపర్ కలదు మరియు వెనుక వైపు చక్రం కోసం సింగల్ పిస్టన్ గల కాలిపర్ 240 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేక్ కలదు.

చక్రాలు

చక్రాలు

ముందు వైపున 21-అంగుళాలు మరియు వెనుక వైపున 18-అంగుళాల చుట్టు కొలత గల చక్రాలు కలవు. అయితే రెండు చక్రాలు కూడా స్పోక్స్‌ను కలిగి ఉన్నాయి.

 అడ్వెంచర్స్ కోసం

అడ్వెంచర్స్ కోసం

రాయల్ ఎన్ఫీల్డ్ దీనిని ముఖ్యంగా అడ్వెంచర్స్‌ను ఎక్కువగా ఇష్టపడే వారి కోసం రూపొందించారని తెలుస్తోంది. ఇందులో అడ్వెంచర్స్ కోసం పొడవైన ట్రావెల్ గల సస్పెన్షన్స్, అప్ రైట్ సీటింగ్ పొజిషన్ మరియు పై వైపుకు మల్లించి ఉండే పొగ గొట్టాలు వంటివి ఉన్నాయి.

 సదుపాయాలు

సదుపాయాలు

మీరు దీని మీద లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినపుడు అదనపు ఇంధనాన్ని నింపుకోవడానికి రెండు వైపులా జెర్రీ క్యాన్లను కల్పించారు. అంతే కాకుండా అదనపు లగేజ్‌ను మీతో పాటు తీసుకు వెళ్లచ్చు.

అందుబాటులోకి

అందుబాటులోకి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 500 లకు పైబడి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయ కేంద్రాలలో అందుబాటులో సిద్దంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో దీనికి ఎటువంటి పోటి లేదు.

ధర వివరాలు

ధర వివరాలు

నగరాల పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ బైకు ఆన్ రోడ్ ధరలు

  • హైదరాబాద్- 1,76,580
  • బెంగళూరు- 1,84,316
  • కలకత్తా- 1,81,517
  • పూనే- 1,70,362
  • ముంబాయ్- 1,71,065
  • చెన్నై- 1,75,840
  •  మరిన్ని కథనాలు....
    • రాయల్ ఎన్ఫీల్డ్‌లోని క్లాసిక్ శ్రేణి బైకుల గొప్పతనం: అందులో క్లాసిక్ 350 మరియు 500
    • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకును ఫోటోలలో చూసుకోండి.
    • ఊహలకందని అమీర్ ఖాన్ వ్యక్తిత్వం మరియు కార్ల ప్రపంచం

Article Published On: Wednesday, March 16, 2016, 16:19 [IST]
English summary
Royal Enfield Himalayan Thunders Into India, Priced At Rs. 1.55 Lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+