రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది
దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న బైకులలో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. దీనిని రాయల్ ఎన్ఫీల్డ్ 2016 ఆటో ఎక్స్ పోల ప్రదర్శించనుంది. అయితే ఎక్స్ పో కన్నా ముందుగా హిమాలయన్ బైకు ఫోటోలను అధికారికంగా విడుదల చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ వారు హిమాలయన్ బైకును విడుదలకు ముందుగా ఆఫ్-రోడ్ మీద పరీక్షించి చూశారు. ఢకార్ ర్యాలీలో పాల్గొన్న మన దేశ దేశ రైడర్ సిఎస్ సంతోష్ సహాయంతో దీనికి ఆఫ్ రోడ్ మీద పరీక్షలు నిర్వహించారు. దీనిని పరీక్షించిన తరువాత సిఎస్ సంతోష్ దీని గురించి మాట్లాడుతూ ఇది ఆన్ రోడ్ మాత్రమే కాదు ఆఫ్ రోడ్ మీద కూడా ఉత్తమ పని తీరును కనబరుస్తుందని తెలిపాడు.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులో ఆయిల్ మరియు ఎయిర్ కూల్డ్ ఎల్ఎస్400 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 24 బిహెచ్‍పి పవర్‌ను వెనుక చక్రాలకు అందిస్తుంది. దీనిని అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాలకు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.


Click it and Unblock the Notifications






























