రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బాటిల్‌లో కెటిఎమ్ మధ్యం అంటే ఇదేనేమో...!!
సుమారుగా రెండు లక్షల విలువ చేసే బైకులోని ఇంజన్‌ను మార్చేసుకున్నాడు ఓ కుర్రోడు. కారణం ఎంటో తెలుసా ? రాయల్ ఇన్ఫీల్డ్ వారు హిమాలయన్ అడ్వెంచర్ బైకులో అందించిన ఇంజన్ ఆశించినంత పవర్ ఉత్పత్తి చేయలేదట.
ఈ కారణంగానే హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ బైకులోని ఇంజన్‌ని కెటిఎమ్ డ్యూక్ 390 ఇంజన్‌తో మార్చేశాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ టూరర్‌లోని సుమారుగా 410సీసీ సామర్థ్యం గల ఇంజన్ సరైన పనితీరుని కనబరచడం లేదని కెటిఎమ్ డ్యూక్ 390 లోని 373సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో మార్చేసుకున్నాడు.

ఇంజన్ మాత్రమే కాకుండా కెటిఎమ్ డ్యూక్ 390 లోని విభిన్న సమాచార తెర గల మీటర్ కన్సోల్ కూడా ఈ హిమాలయన్‌లో అమర్చుకున్నాడు.

కెటిఎమ్ డ్యూక్ 390 లోని పెద్ద పరికరాలతో ఈ హిమాలయన్‌ను మోడిఫై చేసినప్పటికి దీనిని డిజైన్ మరియు ఓవరాల్ లుక్ అత్యంత స్వచ్ఛంగా మరియు వివేకవంతంగా కలదు.

షిఫ్ట్ రాడ్, టర్న్ ఇండికేటర్స్, సెంటర్ కన్సోల్, ఇంజన్ కూలెంట్ రిజర్వాయర్ వంటి అనేక విడి భాగాలను మార్చేశాడు ఈ రాయల్ ఎన్పీల్డ్ హిమాయలన్ ఓనర్.

డ్యూక్ 390 బైకులో ఉన్న స్ప్రాకెట్ (వెనుక చక్కాన్ని తిప్పే పళ్ల చక్రం) కన్నా ఇందులో పెద్దదిగా ఉంది. దీని ద్వారా గరష్ట వేగాన్ని అందుకోవచ్చు కాని తక్కువ వేగంలో ఎక్కువ శక్తిని అందుకోలేదు.

ఇంజన్, మీటర్ కన్సోల్ మరియు కొన్ని ఇతర భాగాలతో మోడిఫికేషన్ చేసిన రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ చూడటానికి శుభ్రంగా ఉంది. అయితే ఇందులో వినియోగించిన కెటిఎమ్ ఇంజన్ ఉత్పత్తి చేసే 44బిహెచ్‌పి అందిస్తుందో లేదో చుడాలి మరి.

కెటిఎమ్ 390 ఇంజన్ గల రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకు గురించి మీ అభిప్రాయం ఏమిటి ? మీ ఆలోచనలను మాతో పంచుకోండి. లేదంటే మీరు కూడా బైకును మోడిఫే చేయించుకున్నట్లయితే ఆ వివరాలను మాతో పంచుకోండి.
via TeamBHP

- ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో
- రూ. 2 కోట్లు ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్


Click it and Unblock the Notifications








