రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ కాదు థండర్‌క్యాట్....!!
కస్టమైజ్డ్ బైకుల ప్రపంచంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఎంతో ప్రత్యేకం, అన్ని రకాల వినియోగదారులను సంతృప్తి పరుస్తూనే కస్టమైజ్డ్ బైకులను అందివ్వడంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది. కస్టమైజ్డ్ బైకులలో రాయల్ ఎన్పీల్డ్ ఉత్పత్తులు విజయాన్ని సాధించడానికి రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి నాణ్యమైన లోహాన్ని వినియోగించడం మరియు అత్యంత సాధారణమైన డిజైన్‌ను కలిగి ఉండటం.

రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా చేసిన అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులలో థండర్ క్యాట్ ఒకటి దీనిని Bulleteer Customs వారు డిజైన్ చేశారు.

బెంగళూరు ఆధారిత సంస్థ Bulleteer Customs 2005 లో కస్టమైజ్ బైకులను డిజైన్ చేయడం ప్రారంభించింది. చిన్న చిన్న కస్టమైజేషన్ పనులు చేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు చిన్న పాటి బిజినెస్‌నే ప్రారంభించింది.

Bulleteer Customs వారు రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌క్యాట్ ను డిజైన్ చేయడానికి థండర్‌బర్డ్ 500 ను వినియోగించారు. ఈ థండర్‌క్యాట్‌లో కేఫ్ రేసర్ బైకులా క్రింది వైపునకు వంగి ఉండే హ్యాండిల్‌ను అందించారు.

పగటి వెలుగును అందించే విధంగా ఉన్న హెడ్ లైట్, ముందు వైపున 120 సెక్షన్ మరియు వెనుక వైపున 190 సెక్షన్ గల టైర్లు, ఆఫ్-సెట్ రియర్ మోనో షాక్ అబ్జార్వర్, డిజిటల్ స్పీడో మీటర్ కన్సోల్, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, హ్యాండిల్ బార్స్‌కు చివరిలో చిన్న సైజు రియర్ వ్యూవ్ అద్దాలు

కొత్తగా డిజైన్ చేయబడిన ఎగ్జాస్జ్ సిస్టమ్, సింగల్ సీటింగ్ సామర్థ్యం ఉన్న సీటు, సీటు క్రింది భాగంలో టెయిల్ ల్యాంపులు, దీనికి పోటీగా ఉన్న ఇతర ఉత్పత్తుల నుండి దీనిని ప్రత్యేకం చేయడానికి అద్భుతమైన సరికొత్త పెయింట్ జాబ్ ఎంతగానో తోడ్పడింది.

సాంకేతికంగా ఈ థండర్‌క్యాట్ బైకులో 499సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది సుమారుగా 27.20బిహెచ్‌పి పవర్ మరియు 41.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఎయిర్ కూలింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ద్వారా ఇంధనాన్ని ఇంజెక్షన్ సిస్టమ్‌కు చేరవేస్తుంది, ఇగ్నిషన్ కోసం డిజిటల్ ఇగ్నిషన్ సిస్టమ్‌ను అందించారు, 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్పాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా చైన్ డ్రైవ్ సిస్టమ్ గుండా ఇంజన్ నుండి పవర్ చక్రాలకు అందుతుంది.

దీని ధర సంభందించిన వివరాలను Bulleteer Customs ప్రతినిధులు వెల్లడించలేదు. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ ధర సుమారుగా రూ. 2,04803 లు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌క్యాట్

మీకు థండర్‌క్యాట్ బైకు గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే Bulleteer Customs ప్రతినిధులను సంప్రదించగలరు. వీరి వివరాలు.
ఫోన్: +91-9972862139, +91-9738075289
ఇ-మెయిల్: [email protected]
ఫేస్‌బుక్: facebook.com/bulleteer.customs

కారు ఇన్సూరెన్స్‌లో పాత విధానాన్ని ఫాలో అయితే నష్టపోయినట్లే..! మీ కోసం కొత్త విధానం


Click it and Unblock the Notifications








