ఫేస్‌బుక్‌లో బైకు అమ్మకానికి పెట్టిన టెక్కీ: అనూహ్యంగా హత్య, దొరికిన హంతకుడు
దేశ ఐటి రాజధాని నగరం బెంగళూలో, అనూహ్యమైన హత్య జరిగింది. కొన్ని రోజుల క్రితం, సోహాన్ హల్దార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి ఉన్నాడు. అయితే ఆఫీస్‌కు రాలేదని ఇతని స్నేహితుడు అపార్ట్‌మెంట్‌కు వచ్చి చూడగా విగతజీవుడుగా పడి ఉన్నాడు. మరణించాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించాడు.
ఇతని గదిలోకి ఇతరులు ప్రవేశించిన దాఖలాలు లేవని, తద్వారా ఇతనిది సహజ మరణం అని భావించారు. కాని తరువాత దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే ఇతను ఒక కెటిఎమ్ డ్యూ390 బైకు కోసం హత్యగావింపబడ్డాడని పోలీసులు తేల్చారు. ఈ మిస్టరీ గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

సోహాన్ హల్దార్ అనే టెక్కీ తన కెటిఎమ్ డ్యూక్ 390 బైకును అమ్మాలని ఫేస్‌బుక్ వేదిక మీద, తన బైకు గురించి కొంత సమాచారం వ్రాసి పోస్ట్ చేశాడు.

అయితే ఈ పోస్ట్‌ను చూసిన కార్తీక్ ఎమ్ దౌలత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆ బైకును కొనుగోలు చేయడానికి ఇష్టమేనని ఫోన్ ద్వారా తెలిపాడు.

ఆ తరువాత కార్తీక్ సోహాన్ అపార్ట్‌మెంట్‌లో ఆగష్టు 1 వ తేదీని కలిశాడు. ఆగష్టు 3 న ఆ బైకును కొనుగోలు చేయడానికి పూర్తిగా ఒప్పుకున్నాడు.

అయితే ఆ మరుసటి రోజు ఇద్దరూ మద్యం సేవించడానికి కూర్చున్నారు. కార్తీక్, సోహాన్‌కు బలవంతంగా మద్యం ఇచ్చాడు. అందులో సిల్వర్ పొటాషియం (సైనైడ్) అనే రసాయన సమ్మేళనాన్ని కలిపి తాగించాడు.

అది తాగిన సోహాన్ ఇంకా చనిపోలేదని గ్రహించిన కార్తీక్ అక్కడే ఉన్న గుడ్డతో మొహాన్ని కప్పేసి ఊపిరాడకుండా చేసి టెక్కీ హత్య చేశాడు.

హత్య అనంతరం సోహాన్ బైకు, హెల్మెట్, పర్స్ తో ఉడాయించాడు. అంతే కాకుండా సోహాన్ ఏటిఎమ్ కార్డుతో సుమారుగా 27,000 రుపాయల నగదును కూడా డ్రా చేశాడు.

అయితే సోహాన్ హల్దార్ సెల్ ఫోన్ లోని కాల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించగా హంతకుడు కార్తీక్‌ని గుర్తించి, బెంగళూరులోని రాజాజీ నగర్‌లో కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

దీనికంటే ముందు పోలీసులు కార్తీక్‌ను, సోహాన్ గది వద్ద కెటిఎమ్ డ్యూక్ 390 బైకుతో వెళుతుండగా సిసిటీవీలో రికార్డయ్యింది. అయితే అతను దొంగ అనుకొని బైక్ పోయినట్లుగా సోనాల్ స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.

కార్తీక్ అకౌంట్లో ఇదొక్కటే కాదు, బ్యాంకులకు రంద్రాలు చేసి బంగారం, నగదు దొంగలించినట్లు కేసులున్నాయి. తన స్నేహితుని ల్యాప్‌ట్యాప్ దొంగలించాడు. చివరికి దొంగ చేరాల్సిన చోటుకు కార్తీక్ చేరుకున్నాడు.

మీరు కూడా బైకు, కారు లేదా మరేదైనా ఉత్పత్తిని అమ్మదలుచుకున్నడు జాగ్రత్తలు పాటించండి, ఏమరపాటుగా అస్సలు వ్యవహరించకండి. కొత్త వ్యక్తులతో కలిసి అస్సలు మద్యం పుచ్చుకోకండి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. అందుకు ఉదాహరణ సోనాల్ హల్దార్ జీవితం.

- అమెరికా అధ్యక్ష విమానం ఎయిర్ ఫోర్స్ వన్ గురించి చారిత్రాత్మక విశేషాలు


Click it and Unblock the Notifications








