గుట్టు చప్పుడు కాకుండా హయాతే ఇపి బైకును విడుదల చేసిన సుజుకి
సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా దేశీయ మార్కెట్లోకి గుట్టు చప్పుడు కాకుండా తమ ఎంట్రీ లెవల్ అప్‌డేటెడ్ బైకు హయాతేను విడుదల చేసింది. సుజుకి వారి ప్రీవియస్ వెర్షన్ హయాతే స్థానంలో ఈ హయాతే ఇపి బైకును ప్రవేశపెట్టింది.
సుజుకి అప్‌డేటెడ్ వెర్షన్ హయాతే ఇపి బైకు గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ధర
సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా దీనిని ధర రూ. 62,166 లు ఆన్ రోడ్ ముంబాయ్ గా వెల్లడించారు.

ఇంజన్
సుజుకి ఈ హయాతే ఇపి బైకులో 113 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్
ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. ఇది దాదాపుగా 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 9.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

మైలేజ్
సుజుకి మోటార్ సైకిల్స్ దీనికి మైలేజ్ పరంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరియు ఈ హయాతే ఇపిలో సుజురి ఎకో ఫెర్ఫామెన్స్ టెక్నాలజీని అందించారు. తద్వారా ఇది ఎక్కువ మైలేజ్ ఇవ్వగల అవకాశం కలదు. అయితే దీనికి సంభందించిన మైలేజ్ వివరాలు ప్రకటించలేదు.

లభించు రంగులు
సుజుకి హయాతే ఇపి బైకు మూడు విభిన్న రంగుల్లో లభించును.
- పియర్ల్ మిరా రెడ్
- గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
- మెటాలిక్ ఆర్ట్ గ్రే
- టైటానిక్-2 షిప్ వస్తోంది, టైటానిక్-1 గురించి మరచిపోండి
- అమితాబచ్చన్ కార్ల ప్రపంచంలోకి వచ్చి చేరిన మరొక కారు
- ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?

డిజైన్
సుజుకి మోటార్ సైకిల్స్ హాయతే డిజైన్ కోసం సరికొత్త నూతన డీకాల్స్ మరియు స్టిక్కర్లను వినియోగించారు.

టైర్లు మరియు చక్రాలు
సుజుకి హయాతే ఇపి బైకులో ముందు మరియు వెనుక వైపు అల్లాచక్రాలు మరియు వీటికి ట్యూబ్ లెస్ టైర్లను అందించారు.

బాడీ రీ డిజైన్
సుజుకి ముందున్న హయాతే బాడీ డిజైన్‌కు పూర్తిగా మార్పులు చేసింది. ఇందులో స్పోర్టి లుక్ కోసం బాడీని నూతనంగా డిజైన్ చేశారు.

సౌకర్యవంతమైన సీటు
సుజుకి ఈ హయాతే ఇపి బైకులో పొడవైన సీటు మరియు పొడవైన వీల్ బేస్‌ను కల్పించారు. తద్వారా ఇందులో సౌకర్యవంతంగా రైడింగ్‌ను అనుభవించవచ్చు.

పోటి
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీవీఎస్ విక్టర్, హోండా లివో మరియు హీరో వారి ప్యాసన్ మోటార్ సైకిల్స్‌తో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

దీని విడుదల సమయంలో సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురానున్నట్లు ప్రకటించింది.



Click it and Unblock the Notifications








