2016 లో విడుదల కానున్న స్కూటర్లు మరియు వాటి వివరాలు

By Anil

2016 సంవత్సరం కార్ల సంస్థలకు మాత్రమే కాదు స్కూటర్ల సంస్థలకు కూడా శుభ సమయం తీసుకువచ్చింది. గత నాలుగైదు సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్కూటర్ల వాడకం విపరీతంగా పెరిగింది. యువత కూడా గేర్లు లేని స్కూటర్లను ఉపయోగించడం మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు తమ స్కూటర్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకున్నాయి. ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే ఈ 2016లో ఏ యే స్కూటర్లు మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయో తెలుసుకుందాం రండి.

10. మహీంద్రా గస్టో

10. మహీంద్రా గస్టో

మహీంద్రా వారికి మంచి విజయ గాథను మిగిల్చిన గస్టో స్కూటర్ పేరు మీదుగా మరొక గస్టో స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశ పెట్టనుంది. ఇంతకు ముందు గల గస్టోలోని ఫీచర్లు కన్నా ఇందుసలో కొన్ని ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సరికొత్త గస్టో స్కూటర్‌లో 109.6సీసీ ఇంజన్ బదులు 125 సీసీ ఇంజన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

09.హోండా పిసిఎక్స్ 150

09.హోండా పిసిఎక్స్ 150

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా వారు భారతీయ మార్కెట్లోకి సరికొత్త పిసిఎక్స్ 150 స్కూటర్ ‌ను విడుదల చేయనున్నారు. ఇందులో 153 సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

08. హీరో మోటోకార్ప్ జడ్‌ఐఆర్

08. హీరో మోటోకార్ప్ జడ్‌ఐఆర్

హీరో మోటోకార్ప్ వారి 150సీసీ సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన స్కూటర్ జడ్ఐఆర్ 150. ఇది హోండా వారి పిసిఎక్స్ 150 స్కూటర్‌కు పోటిగా రానుంది. ఇందులో 157 సీసీ గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 13.8బిహెచ్‌పి పవర్ మరియు 12.7ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో కొత్తగా ఫీచర్లు కూడా అధికంగా ఉన్నాయి.

07.హోండా లీడ్ 125

07.హోండా లీడ్ 125

పిసిఎక్స్ 150 తరువాత మార్కెట్లోకి హోండా వారు మరొక స్కూటర్‌ను అందిస్తున్నారు. 2016లో హోండా లీడ్ 125 స్కూటర్‌ను మార్కెట్లోకి అందివ్వనుంది. ప్రస్తుత స్కూటర్ల మార్కెట్లో దేశ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు నమోదు చేసుకుంటున్న స్కూటర్ ఆక్టివా. దీని కన్నా కొంచెం హెచ్చు స్థానంలో ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో 125సీసీ గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

06. యమహా నోజా

06. యమహా నోజా

యమహా మోటార్స్ భారతీయ స్కూటర్ మార్కెట్లో బ్యాండ్ బాజా మ్రోగించడానికి తమ నోజా స్కూటర్‌తో సిద్దమైపోయింది. ఈ నోజా డిజైన్ కాస్త యమహా ఫ్యాసినొ స్కూటర్‌ను పోలి ఉంటుంది. ఇందులో 113సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

05 పోజియట్ సెటిలిస్ 125

05 పోజియట్ సెటిలిస్ 125

పోజియట్ సంస్థ తన సెటిలిస్ 125 స్కూటర్‌ను దేశీయ స్కూటర్ల మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. పోజియట్ స్కూటర్ ద్వారా మనం ఎక్కువగా ఆశించే అంశాలు ఏవంటే ఫీచర్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో సౌకర్యవంతమైన సీటు, యాంటి-లాక్ బ్రేకింగ సిస్టమ్ మరియు పెద్ద ఎల్‌సిడి స్క్రీన్ వంటి కలవు.

04.పోజియట్ డిజాంగో

04.పోజియట్ డిజాంగో

పోజియట్ వారు భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న మరొక మోడల్ డిజాంగో. ఇది దాదాపుగా 24 విభిన్న రంగుల్లో లభించనుంది. డిజాంగ్ స్కూటర్ లభించు ఇంజన ఆప్షన్‌లు 50సీసీ, 125సీసీ మరియు 150సీసీ కెపాసిటిలలో లభించును.

03. పోజియట్ స్పీడ్ ‌‍‌ఫైట్ 3

03. పోజియట్ స్పీడ్ ‌‍‌ఫైట్ 3

పోజియట్ స్కూటర్స్ వారు ముచ్చటగా మూడవ స్కూటర్‌ను మార్కెట్లోకి అందివ్వనున్నారు. స్పీడ్ ఫైట్ 3 మరియు డిజాంగో రెండు కూడా దాదాపుగా అన్ని విషయాలలో సమానంగా ఉంటాయి. అయితే డిజైన్‌లో కొన్ని మార్పులు కలిగి ఉన్నాయి. డిజాంగో‌లో లభించే అన్ని ఇంజన్ ఆప్షన్‌లు ఇందులో కలవు. వీటికి అదనంగా ముందు మరియు వెనుకవైపున డిస్క్ బ్రేక్‌లను అందించారు.

02. పియాజియో లిబర్టీ 125

02. పియాజియో లిబర్టీ 125

పియోజి స్కూటర్లుకు వెస్పా సంస్థ మాతృ సంస్థగా కలదు. వెస్పా క్రింద కార్యకలాపాలు సాగిస్తున్న పియాజియో స్కూటర్లు నుండి బాగా విజయం సాధించిన స్కూటర్ పియోజియో లిబర్టి. అందుకే పియాజియో స్కూటర్స్ వారు 124సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్‍‌ను కలిగి ఉన్న లిబర్టీ 125 స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

01. పియాజియో ఫ్లై 125

01. పియాజియో ఫ్లై 125

పియాజియో నుండి మార్కెట్లోకి రెండవ ఉత్పత్తి గా విడుదల కానున్న స్కూటర్‌ పియాజియో ఫ్లై 125. ఇది కూడా 124 సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది దాదాపుగా 12 బిహెచ్‌‌‌పి పవర్ మరియు 10.7 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే ముందు మరియు వెనుక రెండు చక్రాలకు కూడా ట్యూబ్ లెస్ టైర్లను అందించారు.

మరిన్ని కథనాలు కోసం...
  1. 2015 లో టాప్-10 బెస్ట్ స్కూటర్లు
  2. మానవ సృష్టికి హదే లేదా...?
  3. 2016లో విడుదలకు సిద్దమైన కార్లు, వాటి వివరాలు, ధర.. గురించి

Article Published On: Tuesday, January 5, 2016, 10:25 [IST]
English summary
Top 10 Upcoming Scooters in 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+