భారీ మైలేజ్‌నిచ్చే ఆరు భారతీయ స్కూటర్లు

By Anil

స్కూటర్లు కొనుగోలు చేయడం వలన చాలానే లాభాలు ఉన్నాయి. అందులో కుటుంబం మొత్తం వినియోగించే సౌలభ్యం మరియు అత్యంత సులభంగా రైడింగ్ చేసే అవకాశం. ఈ రెండు కారణాల చేతనే కాబోలు ఇప్పుడు స్కూటర్ల మార్కెట్ చాలా పెరిగిపోయింది.

ఈ రెండు అంశాలకు మైలేజ్ అనే అంశాన్ని జోడించి మాట్లాడుకుంటే ఇండియాలో ఉన్న చాలా స్కూటర్లు వెనక్కి తగ్గాల్సిందే. అయితే భారీ మైలేజ్‌నిచ్చే స్కూటర్లు కూడా మన మార్కెట్లో ఉన్నాయండోయ్. అందులో ఉత్తమ మైలేజ్‌నిచ్చే ఆరు స్కూటర్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం....

6. టీవీఎస్ జూపిటర్

6. టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ వారి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. టీవీఎస్ వారి కథనం ప్రకారం లీటర్‌కు 62 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు, కాని నిజజీవితంలో అన్ని రకాల డ్రైవింగ్ కండీషన్ల వద్ద ఇది లీటర్‌కు 45-55 కిలోమీటర్ల వరకు మైలేజ్‌నిస్తుంది.

సాంకేతిక మరియు ధర వివరాలు

సాంకేతిక మరియు ధర వివరాలు

టీవీఎస్ మోటార్స్ ఇందులో 109.7సీసీ సామర్థ్యం ఉన్న ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 7.88బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ కేవలం 7.2 సెకండ్ల కాలంలోనే 0-60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

జూపిటర్ ధర వివరాలు

  • జూపిటర్ 110 ధర రూ. 49,000 లు
  • జూపిటర్ జడ్ఎక్స్ ధర రూ. 51,000 లు
  • జూపిటర్ మిలియన్ఆర్ ఎడిషన్ ధర రూ. 53,000 లు
  • 5. మహీంద్రా గస్టో

    5. మహీంద్రా గస్టో

    మహీంద్రా వారి కథనం ప్రకారం గస్టో లీటర్‌కు 63 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇక రోడ్డు మీదకు తీసుకువస్తే కాస్త అటు ఇటుగా 45 నుండి 55 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. గస్టో గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఆరు లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న దీని మొత్తం బరువు 120 కిలోలుగా ఉంది.

    సాంకేతిక మరియు ధర వివరాలు

    సాంకేతిక మరియు ధర వివరాలు

    మహీంద్రా వారు తమ గస్టో లో 109.6సీసీ సామర్థ్యం ఉన్న ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ గల ఇంజన్ కలదు, ఇది సుమారుగా 8 బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వొల్కనిక్ రెడ్, ఆర్కిటిక్ వైట్ మరియు రవెన్ బ్లాక్ అనే రంగుల్లో లభించును.

    గస్టో ధర వివరాలు

    • గస్టో డిఎక్స్ ధర రూ . 46,000 లు
    • గస్టో హెచ్ఎక్స్ ధర రూ. 48,000 లు
    • గస్టో విఎక్స్ ధర రూ. 50,000 లు
    • 4. సుజుకి లెట్స్

      4. సుజుకి లెట్స్

      సుజుకి స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ వారి లైట్ వెయిట్ స్కూటర్‌ను సుజుకి ఎకో పర్ఫామెన్స్ ఇంజన్‌తో మహిళలకు ప్రత్యేకమైన ఉత్పత్తిని లెట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సుజుకి వారి కథనం ప్రకారం ఇది లీటర్‌కు 63 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు, అయితే అన్ని రోడ్ కండీషన్లలో ఇది లీటర్‌కు 45 నుండి 55 కిలోమీటర్ల మధ్య మైలేజ్ ఇవ్వగలదు.

      సాంకేతిక మరియు ధర వివరాలు

      సాంకేతిక మరియు ధర వివరాలు

      సుజుకి ఈ లెట్స్ స్కూటర్లో 112.8సీసీ సామర్థ్యం ఉన్న ఫోర్ స్ట్రోర్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ సుజుకి ఎకో పర్ఫామెన్స్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.7బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సుజుకి లెట్స్ కేవలం 7.20 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

      సుజుకి లెట్స్ ధరలు

      • సింగల్ టోన్ వేరియంట్ ధర రూ. 46,441 లు
      • డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ. 47,441 లు
      • 3. హీరో డ్యూయెట్

        3. హీరో డ్యూయెట్

        హీరో మోటోకార్ప్ స్వంత పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన హీరో డ్యూయెట్‌లో 110సీసీ సామర్థ్యం గల ఇంజన్ కలదు, ఇది సుమారుగా లీటర్‌కు 63.8కిలోమీటర్ల మైలేజే ఇవ్వగలదని హీరో తెలిపింది. అయితే రియల్ లైఫ్‌లో సుమారుగా 45 నుండి 55 మధ్య దీని మైలేజ్ ఉంటుంది.

        సాంకేతిక మరియు ధర వివరాలు

        సాంకేతిక మరియు ధర వివరాలు

        హీరో మోటోకార్ప్ ఇందులో సరిగ్గా 110.9సీసీ సామర్థ్యం ఉన్న ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 8.31బిహెచ్‌పి పవర్ మరియు 8.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీని గరిష్ట వేగం గంటకు 85కిలోమీటర్లుగా ఉంది.

        హీరో డ్యూయెట్ ధర వివరాలు

        • డ్యూయెట్ ఎల్ఎక్స్ ధర రూ. 47,600 లు
        • డ్యూయెట్ విఎక్స్ ధర రూ. 49,250 లు
        • 2. యమహా రే జడ్ఆర్

          2. యమహా రే జడ్ఆర్

          యమహా తమ రే జడ్ఆర్ స్థానంలో ఇప్పుడు సిగ్నస్ రే జడ్ఆర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే రెండు కూడా ఒకే ఫ్లాట్ ఫామ్ మీద అభివృద్ది చెందినవే యమహా వారి కథనం ప్రకారం ఇది లీటర్‌కు 66 కిలోమీటర్లు ఇవ్వగలదు అయితే మన రోడ్ల మీద అన్ని రకాల కండీషన్లలో డ్రైవ్ చేసినపుడు 48 నుండి 56 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది.

          సాంకేతిక మరియు ధర వివరాలు

          సాంకేతిక మరియు ధర వివరాలు

          యమహా ఇందులో 113సీసీ సామర్థ్యం ఉన్న ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 7బిహెచ్‌పి పవర్ మరియు 8.1ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. 5.2లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు.

          ధర వివరాలు

          • రే జడ్ఆర్ డిస్క్ ధర రూ. 54,500 లు
          • రే జడ్ఆర్ డ్రమ్ ధర రూ. 52,000 లు
          • 1. హోండా ఆక్టివా ఐ

            1. హోండా ఆక్టివా ఐ

            ఆక్టివాలోని టాప్ ఎండ్ వేరియంట్ నుండి ప్రారంభం వేరియంట్ ఐ వరకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ప్రతి వేరియంట్ అదే రీతిలో ప్రత్యేకతలున్నాయి. స్కూటర్లన్నింటిలో కెల్లా గరిష్ట మైలేజ్ ఇవ్వగల ఇది అమ్మకాల పరంగ కూడా మొదటి స్థానంలో ఉంది. హోండా వారి కథనం ప్రకారం లీటర్‌కు 69.6 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు, అయితే నిజ జీవితంలో ఇది 50 నుండి 60 మధ్య మైలేజ్ ఇవ్వగలదు.

            సాంకేతిక మరియు ధర వివరాలు

            సాంకేతిక మరియు ధర వివరాలు

            హోండా ఇందులో 109.2సీసీ సామర్థ్యం ఉన్న ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిల్ కూల్జ్ ఇంజన్‌ను అందించింది, ఇది సుమారుగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.74ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

            ఆక్టివా ఐ ధర వివరాలు

            • స్టాండర్డ్ మోడల్ ధర ర ూ. 46,744 లు
            • డీలక్స్ మోడల్ ధర రూ. 47,235 లు
            • గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలను బట్టి ధరల్లో తేడా ఉంటుంది.
              భారీ మైలేజ్‌నిచ్చే స్కూటర్లు

              లీటర్‌కు 42 కిమీల మైలేజ్: ఇవి పాటిస్తే మీ కారు కూడా ఇస్తుంది

              గరిష్ట మైలేజ్ ఇవ్వగల పది డీజల్ ఎస్‌యువిలు

Most Read Articles

English summary
Top 6 Most Fuel Efficient Scooters in India
Story first published: Friday, August 26, 2016, 13:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X