ఇండియన్ మార్కెట్లో ఉన్న ఐదు అత్యంత చౌక బైకులు

By Anil

టూ వీలర్లలో ఉన్న కమ్యూటర్ సెగ్మెంట్ ఎంతో పోటీతో కూడుకున్నది మరియు ప్రతి తయారీ సంస్థ కూడా అత్యంత ఉత్తమమైన ఉత్పత్తులను అందివ్వాలని ప్రత్నిస్తుంది. అయితే ఉత్తమ ఉత్పత్తులుగా నిలవాలంటే ధర, మైలేజ్, సులభమైన డ్రైవింగ్ సౌలభ్యం మరియు తక్కువ ధరతో సర్వీసింగ్ చేయించడం వంటి అనేక అంశాలు ఈ కమ్యూటర్ సెగ్మెంట్లోని బైకులు రాణించడానికి ఉపయోగపతాయి.

తయారీదారులు దృష్ట్యానే కాకుండా కొనుగోలు దారులు దృష్ట్యా కూడా ఈ అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా 2016 ఏడాదిలో దేశీయంగా ఈ అన్ని అంశాలకు న్యాయం చేకూర్చే ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ బైకులు గురించి క్రింది కథనంలో అందిస్తున్నాము.

5. హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

5. హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న బైకులలో స్ల్పెండర్ మొదటి స్థానంలో ఉంది. స్ల్పెండర్‍‌కు అప్‌గ్రేటెడ్ వర్షన్‌గా హీరో సంస్థ ఐస్మార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఐ3ఎస్ అనే సాంకేతికతను వినియోగించారు తద్వారా ఇది లీటర్‌కు 102.50 కిలోమీటర్ల మైలేజ్‌ ఇవ్వగలదు.

ఐ3ఎస్ టెక్నాలజీ

ఐ3ఎస్ టెక్నాలజీ

మీరు బైకును స్టార్ట్ చేసి నడపకుండా అలాగే ఉంచితే ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. తరువాత బైకు నడపాల్సి వచ్చినపుడు క్లచ్‌ను పట్టుకుంటే ఇంజన్ ఆటోమేటి‌క్‌గా ఆన్ అవుతుంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత మైలేజ్‌మ ఇవ్వగలిగే బైకుగా నిలిచింది.

2016లో ఉన్న ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ బైకులు

ఇందులో 97.2సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు, ఇది సుమారుగా 8.24బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. తాజాగ అందించిన సమాచారం ప్రకారం హీరో మోటోకార్ప్ ఈ 100సీసీ ఇంజన్‌కు బదులుగా 110సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందివ్వనున్నారు.

  • ధర రూ. 58,718 లు ఆన్ రోడ్ విజయవాడగా ఉంది.
  • మైలేజ్ హీరో వారి ప్రకారం లీటర్‌కు 102.50 కిమీలు.
  • 4. టీవీఎస్ స్టార్ సిటి ప్లస్

    4. టీవీఎస్ స్టార్ సిటి ప్లస్

    ధర, మైలేజ్ మరియు బడ్జెట్ వంటి అంశాల పరంగా ఉన్న మరొక బైకు టీవీఎస్ మోటార్స్‌కు చెందిన స్టార్ సిటి. అయితే దీనికి కొంచెం కొత్త డిజైన్ సొబగులు జోడించి న్యూ లుక్‌తో స్టార్ సిటి ప్లస్‌గా అందుబాటులోకి తీసుకువచ్చారు.

    సాంకేతిక వివరాలు

    సాంకేతిక వివరాలు

    టీవీఎస్ మోటార్స్ స్టార్ సిటి ప్లస్ మోటార్ బైకులో అందించిన 109.7సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ సుమారుగా 8.28బిహెచ్‌పి పవర్ మరియు 8.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

    ధర మరియు మైలేజ్ వివరాలు

    ధర మరియు మైలేజ్ వివరాలు

    ఇందులోని శక్తివంతమైన 110సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ సుమారుగా 86 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. దీనిఆన్ రోడ్ ధర రూ. 53,093 లు విజయవాడగా ఉంది.

     3. బజాజ్ ప్లాటినా 100 ఇఎస్

    3. బజాజ్ ప్లాటినా 100 ఇఎస్

    ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ మైలేజ్‌ ఇవ్వగల పాత బైకు బజాజ్ ప్లాటినా. బజాజ్ ప్లాటినా 100 ఇఎస్ బైకు ప్రపంచపు మైలేజ్ ఛాంపియన్లు అనే ట్యాగు లైనుతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ ప్లాటినా 100 ఎస్ బైకు ముందు మరియు వెనుక వైపున విశాలమైన టైర్లు మరియు పొడవైన సీటును కలిగి ఉంది.

    సాంకేతిక వివరాలు

    సాంకేతిక వివరాలు

    బజాజ్ ఆటో సంస్థకు చెందిన ప్లాటినా 100ఇఎస్ బైకులో 102సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు. ఇది సుమారుగా 8.08బిహెచ్‌పి పవర్ మరియు 8.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

    ధర మరియు మైలేజ్ వివరాలు

    ధర మరియు మైలేజ్ వివరాలు

    బజాజ్ ప్లాటినా 100 ఇఎస్ ఆన్ రోడ్ విజయవాడ ధర రూ. 51,254 లు గా ఉంది మరియు ఇది లీటర్‌కు గరిష్టంగా 96.9 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

    2. హోండా నవీ

    2. హోండా నవీ

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల ద్విచక్రవాహనాలకు ఇది ఎంతో భిన్నంగా ఉంటుంది. సరికొత్త డిజైన్‌తో వచ్చిన ఇది ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. మీ డైలీ లైఫ్‌లో వినియోగించి అన్ని బైకుల కన్నా దీని రైడింగ్ ఎంతో విభిన్నంగా ఉంటుంది.

    2016లో ఉన్న ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ బైకులు

    విడుదైలన కేవలం ఒక్క నెల వ్యవధిలోనే సుమారుగా 10,000 యూనిట్ల నవీ స్కూటర్లు అమ్ముడుపోయాయి. అయితే దీనికి పెరిగిన డిమాండ్ వలన దీని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా మందిలో పెరిగింది. అంతే కాకుండా ఇది కొన్ని రకాల మోడిఫికేషన్లలో కూడా లభించనుంది.

    ధర, మైలేజ్ మరియు సాంకేతిక వివరాలు

    ధర, మైలేజ్ మరియు సాంకేతిక వివరాలు

    హోండా యాక్టివాలో వినియోగించిన 109.19సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ కలదు. ఇది సుమరుగా 7.83బిహెచ్‌పి పవర్ మరియు 8.96ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌న అనుసంధానం చేశారు.

    • ధర రూ. 48,772 ఆన్ రోడ్ విజయవాడగా ఉంది
    • మైలేజ్ లీటర్‌కు 42 నుండి 52 కిమీ/లీ మధ్య ఇవ్వగలదు.
    • 1. బజాజ్ సిటి 100బి

      1. బజాజ్ సిటి 100బి

      ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన బైకు బజాజ్ సిటి100బి. డిజైన్, గ్రాఫిక్స్ మరియు నల్లటి ఎగ్జాస్ట్ పైపు వంటివి ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ ఇది ఎంతో ఉత్తమ పనితీరును కనబరుస్తుంది.

      సాంకేతిక వివరాలు

      సాంకేతిక వివరాలు

      బజాజ్ ఆటో సంస్థ ఈ సిటి100బి లో 99.27సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది సుమారుగా 8.08బిహెచ్‌పి పవర్ మరియు 8.15ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్‌కు 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

      ధర మరియు మైలేజ్ వివరాలు

      ధర మరియు మైలేజ్ వివరాలు

      • ధర: రూ. 31,485 లు ఎక్స్‌ షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది.
      • మైలేజ్: 90 కిలోమీటర్/లీటర్

Article Published On: Tuesday, July 12, 2016, 11:32 [IST]
English summary
Top 5 Budget Friendly Bikes In India 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+