అక్టోబర్ లో అత్యధిక విక్రయాలు జరిపిన టూ వీలర్ కంపెనీలు
అక్టోబర్ నెలలో రెండు ముఖ్యమైన పండుగలు వచ్చిన విశేషం వలన టూ వీలర్ అమ్మకాలు మంచి ఫలితాలను సాధించాయి. అక్టోబర్ లో అత్యధికంగా టూ వీలర్ విక్రయాలు చేపట్టిన టాప్ కంపెనీల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీల్లో ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటి. దేశీయ వాహన పరిశ్రమలో టూ వీలర్ల వాటా 81 శాతం ఉంది. మిగతా వాహనాలతో పోల్చితే టూ వీలర్ల విక్రయాలు భారీగా నమోదవుతున్నాయి.

ఇక గత అక్టోబర్ నెలలో రెండు పండగలు వచ్చిన నేపథ్యంలో అమ్మకాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఈ సారి టాప్ 10 అమ్మకాలు సాధించిన బైకులు కాకుండా. అత్యధిక అమ్మకాలు జరిపిన టూ వీలర్ కంపెనీల గురించి ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి.

హీరో మోటోకార్ప్ (HMCL)
ప్రపంచపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. గడిచిన 15 ఏళ్ల పాటు హీరో మోటోకార్ప్ ఇదే స్థానంలో ఉంది. గణాంకాల ప్రకారం గడిచిన 2016 అక్టోబర్ మాసంలో 6,63,153 యూనిట్ల బైకుల విక్రయాలు నమోదయ్యాయి.

వరుసగా ప్రతి నెలా 6 లక్షల పైబడి విక్రయాలు జరపడం ఇది మూడవ సారి గత ఏడాది ఇదే మాసంతో పోల్చితే విక్రయాల్లో 3.65 శాతం వృద్ది నమోదైంది. అయితే సెప్టెంబర్ 2016 తో అక్టోబర్ అమ్మకాలు పోల్చితే 1.75 శాతం వృద్దిని కోల్పోయింది.

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI)
హోండా టూ వీలర్ల సంస్థ అత్యధిక అమ్మకాలు సాధించడానికి ప్రతి సారి దోహదమయ్యే ఉత్పత్తి ఆక్టివా. గడిచిన అక్టోబర్ 2016 లో హోండా 4,92,367 యూనిట్ల విక్రయాలు జరిపింది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 2016 నెలలో మొత్తం 10 లక్షల టూ వీలర్ల అమ్మకాలు జరపగా అందులో 7 లక్షల వరకు ఆక్టివా అమ్మకాలు ఉన్నట్లు హోండా తెలిపింది.

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ గత ఏడాది అక్టోబర్ 2015 లో 4,31,865 యూనిట్ల అమ్మకాలు జరిపింది. వాటితో పోల్చికుంటే 9 శాతం వృద్ది నమోదైంది. అయితే ఇదే సంవత్సరంలో సెప్టెంబర్ 2016 అమ్మకాలతో పోల్చుకుంటే 13.5 శాతం వృద్దిని కోల్పోయింది.

బజాజ్ ఆటో లిమిటెడ్ (BAL)
బజాజ్ ఆటో అక్టోబర్ 2016 అమ్మకాలు ప్రకారం 3,07,892 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే అక్టోబర్ మాసంతో పోల్చితే బజాజ్ 3,08,733 యూనిట్ల విక్రయాలు జరిపింది. పెద్ద తేడా లేకుండా నిలకడగా ఫలితాలు సాధించింది.

బజాజ్ స్కూటర్లను కాకుండా కేవలం బైకుల ద్వారానే ఈ విక్రయాలు సాధించింది. దేశీయం అమ్మకాలు స్వల్పంగా పెరిగా, ఎగుమతులు స్వల్పంగా తగ్గిపోయాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ
గణాంకాల ప్రకారం టీవీఎస్ మోటార్స్ గడిచిన అక్టోబర్ 2016 లో 3,03,885 యూనిట్ల విక్రయాలు జరిపింది. గత ఏడాది ఇదే నెలలో 2,64,112 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

టీవీఎస్ శ్రేణిలో ఉన్న స్కూటర్లు మరియు బైకులు రెండింటి అమ్మకాల్లో ఆశించిన స్థాయిలో 15.1 శాతం వృద్ది నమోదైంది.

ఇండియా యమహా మోటార్ (IYM)
యమహా ఇండియా గడిచిన అక్టోబర్ 2016 లో 86,428 బైకులు అమ్మకాలు జరిపింది. గత ఏడాది అక్టోబర్ 2015 విక్రయాలు 70,812 యూనిట్లతో పోల్చుకుంటే 22 శాతం వృద్దిని సాధించింది.

తమ బైకుల అమ్మకాల్లో సెప్టెంబర్ మరియు అక్టోబర్‌కు గాను లక్ష యూనిట్లు విక్రయాలు జరిగాయి. దేశీయంగా ఉన్న టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో ఈ విక్రయాలు అధికంగా నమోదయ్యాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ (RE)
అత్యధికంగా అమ్మకాలు జరిపే ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో పోటీ పడుతున్న ఈ ఎక్కువ కెపాసిటీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోల్చుకుంటే 33 శాతం వృద్దిని నమోదు చేస్తూ అమ్మకాలను సాధించింది.

ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్పీల్డ్ గత ఏడాది అక్టోబర్ 2015 లో 44,522 యూనిట్లు అమ్ముడుపోగా ఈ ఏడాది అక్టోబర్‌లో 59,127 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

చివరగా
ప్రతి ఏడాది లోని సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో టూ వీలర్లు మరియు ఫోర్ వీలర్ల తయారీ సంస్థలకు అత్యంత ముఖ్యమైనవి. ఈ రెండు నెలల్లో జరిగే అమ్మకాలు ఎన్నో సంస్థలకు అత్యంత ప్రదానం. ఇక బడా సంస్థలకు అయితే వీలైనన్ని అమ్మకాలకు ఢోకాలు లేదు. అక్టోబర్‌లో వచ్చే దసరా మరియు దీపావళి వంటి పండుగల నేపథ్యంలో ప్రతి ఏడాది కూడా ఇదే తరహా అమ్మకాలు నమోదవుతాయి.

- తరచూ ఎయిర్ ట్రావెల్ చేసినా గమనించలేని నిజాలు
- స్క్రాప్ తో తయారు చేసిన ఈ బైకు నాలుగు రకాల ప్యూయల్స్ తో నడుస్తుంది
- ఒకే కారు, ఒకే ఓనర్, ఒక మిలియన్ మైళ్లు నడిచిన కారు: ఇప్పటికీ నడుస్తోంది


Click it and Unblock the Notifications








