ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో ఉన్న టాప్-10 తయారీ సంస్థలు
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కార్లు కన్నా ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది టూ వీలర్ల సెగ్మెంట్. అంతర్జాతీయంగా చూసినప్పటికీ ఇండియాలో టూ వీలర్ల అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ మన దేశంలో ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ ఏరోజుకారోజు భారీ స్థాయిలో అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకోసం ప్రస్తుతం మన దేశంలో ద్విచక్రవాహనాలను అందిస్తున్నా టాప్-10 తయరీ సంస్థలు ఎవో చూద్దాం రండి.

10. హ్యార్లీ-డేవిడ్‌సన్
అమెరికా ఆధారిత హై సీసీ కెపాసిటి ఉన్న బైకుల తయారీ సంస్థకు హర్యానాలో గుర్‍గావ్ లో సొంత తయారీ యూనిట్ కలదు. ఇక్కడ స్ట్రీట్ 750 క్రూయిజ్ మరియు స్ట్రీట్ 500 బైకులను ఉత్పత్తి చేస్తోంది.

2011 లో ప్రారంభమైన స్ట్రీట్ 750 క్రూయిజ్ బైకులను ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు స్ట్రీట్ 500 మరియు స్ట్రీట్ 750 క్రూయిజ్ బైకులను ఎగుమతి చేస్తోంది.

09. మహీంద్రా
సాధారణ 100 సీసీ కెపాసిటి గల బైకులు మరియు స్కూటర్ల నుండి మోటోజిపి తరహా బైకుల వరకు ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టింది దేశీయ అతి పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా.

మహీంద్రా 300 సీసీ సెగ్మెంట్లో పోజియట్ వారి ఉత్పత్తులను తలదన్నే రీతిలో మోజో బైకును తయారు చేసింది. ఈ సెగ్మెంట్లో మహీంద్రా మోజో ద్వారా మెజారిటీ వాటాన్ని కైవసం చేసుకుంది.

08. కెటిఎమ్
ఆస్ట్రియాకు చెందిన కెటిఎమ్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థను దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేసింది. ఇండియా మరియు యూరోపియన్ మార్కెట్లకు కావాల్సిన కెటిఎమ్ బైకులను బజాజ్ తమ సమక్షంలో ఉత్పత్తి చేస్తోంది.

ఇండియన్ మార్కెట్లో రేసింగ్ బైకులను సరైన ధరలతో అందుబాటులో ఉంచింది. అందులో డ్యూక్ మరియు ఆర్‌సి రేంజ్ బైకుల వాటా ఎక్కువగా ఉంది.

07. సుజుకి
జపాన్‌కు చెందిన సుజుకి మోటార్స్ ఇండియా సంస్థకు ప్రారంభం నుండి ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. అయితే జిక్సర్ మరియు ఇతర నూతన స్కూటర్ల ద్వారా మార్కెటో వాటాను కొంతం వరకు తన ఖాతాలో వేసుకుంది.

సుజుకి విడుదల చేసిన స్పోర్ట్స్ తరహా బైకులైన జిక్సర్ స్ట్రీట్ ఫైటర్. జిక్సర్ ఎస్ఎఫ్ వంటి శ్రేణి వాహనాలు మంచి అమ్మకాలు సాధించాయి. వీటితో పాటు శరవేగంగా అభివృద్ది చెందుతున్న స్కూటర్ల మార్కెట్లో కూడా అత్బుతమైన స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది.

06. యమహా
ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో ఇపుడు మేజర్ సంస్థగా ఎదిగింది. పాత రోజుల్లో యమహా ఆర్ఎక్స్ మరియు ఆర్‌డి అనే వినూత్నమైన 2-స్ట్రోక్ బైకులను ఉత్పత్తి చేసినప్పటికీ అప్పట్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

జపాన్ ఆధారిత సంస్థ అయిన యమహా గేర్ మార్తి రేసింగ్ తరహా ఉత్పత్తుల మీద దృష్టి సారించి వైజడ్‌ఎఫ్-ఆర్15 మరియు ఎఫ్‌జడ్ శ్రేణి బైకులను ఉత్పత్తి చేసింది. ఇపుడు ఈ సెగ్మెంట్లో దీని మార్కెట్ ఎక్కువగా ఉంది.

05. రాయల్ ఎన్ఫీల్డ్
స్వదేశీ పరిజ్ఞానంతో ప్రారంభమైన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఆరంభంలో క్లాసిక్ మరియు రెట్రో శైలి గల బైకులకు బాగా ప్రసిద్దిగాంచింది. ఈ ఏడాదిలో హిమాయలన్ బైకును అందుబాటులోకి తెచ్చి అడ్వెంచర్ బైకుల విభాగంలోకి కూడా అడుగులు వేసింది.

విసృత స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ తమ ఉత్పత్తులను ప్రపంచ నలుమూలలకు విస్తరించే ఆలోచనలో ఉంది.

04. టివీఎస్ మోటార్స్
దేశీయంగా బాగా పేరుగాంచిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ ఇపుడు అంతర్జాతీయ ఉత్పత్తులకు ధీటుగా నూతన ఇంజన్ మరియు డిజైన్ శైలితో నయా ఉత్పత్తులకు శ్రీ కారం చుట్టింది. ఆ మధ్య బిఎమ్‌డబ్ల్యూతో కూడా జట్టు కట్టింది.

తక్కువ స్థాయి సీసీ కెపాసిటి నుండి ఎక్కువ పనితీరు కనబరిచే టూ వీలర్ల మరియు త్రీ వీలర్లను దేశీయంగా కాకుండా అంతర్జాయ మార్కెట్‍కు ఎగుమతి చేస్తోంది. చెన్నై ఆధారిత ఈ సంస్థ త్వరలో మరిన్ని విశిష్ట ఉత్పత్తులను దేశీయంగా అందుబాటులోకి తీసుకువస్తోంది.

03. బజాజ్
బజాజ్ ఆటో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం తమ ఎదుగుదలతో పాటు మరిన్ని ఇతర సంస్థలకు తమ సామ్రాజ్యంలో చోటు కల్పించింది. ప్రస్తుతం కవసాకి మరియు కెటిఎమ్ వంటి సంస్థలకు అండగా నిలబడింది వారి ఉత్పత్తుల తయారీకి చేయందిస్తోంది.

విదేశీ సంస్థలకు మాత్రమే కాకుండా తమ సంస్థలో విసృత స్థాయి ఉత్పులను అందుబాటులో ఉంచింది. భారతీయ వినియోగదారులు ఎటువంటి ఉత్పత్తులను ఏ ధరల మధ్య కోరుకుంటారు అనే విషయాన్ని పూర్తిగా అవపోసన పట్టగలదు బజాజ్. టూ వీలర్లతో పాటు త్రీ వీలర్లను కూడా అందుబాటులో ఉంచింది బజాజ్.

02. హీరో మోటో కార్ప్
దేశీయ టూ వీలర్ల మార్కెట్లో అత్యంత శక్తివంతమైన సంస్థ హీరో మోటో కార్ప్. పనితీరు, మైలేజ్, బడ్జెట్ మరియు స్కూటర్లు వంటి వివిధ రకాల ఉత్పులను అందుబాటులో ఉంచింది.

దేశీయ టూ వీలర్ల తయారీ సంస్థ ప్రస్తుతం ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో ఎంతో వేగంగా అభివృద్ది చెందుతోంది. విశిష్ట ఉత్పులను అందిస్తున్న హీరో కొన్ని ఉత్పులను అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రవేశపెడుతోంది.

01. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ ప్రారంభంలో హీరో ద్వారా జట్టు కట్టి దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టింది. అయితే ఎంతో కాలం కొనసాగలేక పోయిన ఈ జపాన్ ఆధారిత తయారీ సంస్థ హోండా హీరో నుండి వైదొలగి స్వతహాగా సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది.

ప్రస్తుతం హోండా ప్రపంచ స్థాయి నాణ్యత మరియు డిజైన్ గల ఉత్పత్తులను ఇండియన్స్ మీద ప్రభావం చూపేలా అందిస్తోంది. అందులో తాజాగా అందుబాటులోకి తెచ్చిన నవీ స్కూటర్ ఉదాహరణ.

150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు


Click it and Unblock the Notifications








