సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

దేశీయ ద్విచక్ర వాహన సెగ్మెంట్లో గడిచిన సెప్టెంబర్‌లో అత్యధిక అమ్మకాలు సాధించిన టూ వీలర్ల గురించి ప్రత్యేక కథనం. ఈ జాబితాలో బైకుల కన్నా స్కూటర్ల అమ్మకాలు అధికంగా ఉండటం గమనార్హం.

By Anil

భారత దేశపు ఆటోమొబైల్ పరిశ్రమలో బైకుల కన్నా స్కూటర్ల వాటా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుండి బైకుల మీద పోటాపోటీగా స్కూటర్ల అమ్మకాలు నమోదవుతున్నాయి. ఒక దశలో వినియోగదారులు బైకుల కన్నా స్కూటర్ల మీదనే ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఎప్పటిలాగే తమ ఆక్టివా ద్వారా భారీ అమ్మకాలను మూటగట్టుకుంది. ప్రతి మాసంలో కూడా మొదటి స్థానంలో నిలుస్తున్న ఆక్టివా ఈ సారి కూడా అదే స్థానంలో నిలిచింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

జపాన్‌కు చెందిన హోండా ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ గడిచిన సెప్టెంబర్ మాసంలో 3,01,529 యూనిట్ల ఆక్టివా అమ్మకాలను నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే మాసంలో 2,29,382 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితంతో పోల్చుకుంటే అమ్మకాల పరంగా 31 శాతం వృద్ది నమోదైంది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

హోండా సుమారుగా 15 ఏళ్ల క్రితం భారతీయులకు పరిచయం అయ్యింది. దేశీయంగా ఉన్న అన్ని రాష్ట్రాలు దాదాపుగా బైకులనే ఎంచుకునేవి, అయితే గత కొన్నేళ్ల నుండి ఈ ధోరణి మారింది ఇప్పుడు బైకులకు సమానంగా స్కూటర్లను ఎంచుకుంటున్నారు.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

అత్యధిక అమ్మకాలు సాధించిన టూ వీలర్లలో హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ల్పెండర్ అమ్మకాలను గత ఏడాది సెప్టెంబర్ తో పోల్చుకుంటే పెద్దగా వృద్ది కనబడలేదు.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

గడిచిన 2015 సెప్టెంబర్‌లో 2,43,188 యూనిట్ల స్ల్పెండర్ బైకులు అమ్ముడుపోగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2,54,704 యూనిట్ల అమ్ముడుపోయి 5 శాతం వృద్దిని కనబరిచింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

మూడవ స్థానంలో హీరో వారి హెచ్‌ఎఫ్ డీలక్స్ గత ఏడాది సెప్టెంబర్ అమ్మకాలను ఈ ఏడాది సెప్టెంబర్ అమ్మకాలతో పోల్చితే భారీ వృద్ది కనిపించింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

హీరో మోటోకార్ప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,31,867 యూనిట్ల హెచ్ఎఫ్ డీలక్స్ అమ్మకాలు జరిపి ఏకంగా 30 శాతం వృద్దిని నమోదు చేసింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

హీరో మోటోకార్ప్ వారి ప్యాసన్ అమ్మకాల పరంగా 15 శాతం వృద్దిని కోల్పోయినప్పటికీ ఎప్పటిలాగే నాలువ స్థానంలోనే నిలిచింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

గత ఏడాది సెప్టెంబర్‌లో 1,01,579 యూనిట్ల ప్యాసన్ బైకులు అమ్ముడుపోగా ఈ యేడు అదే మాసంలో 15 శాతం వృద్దిని కోల్పోయి 92,378 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

హోండా వారి సిబిషైన్ ఈ జాబితాలో మళ్లీ 5 వ స్థానంలో నిలిచింది. ఏడాది ప్రారంభం నుండి వరుసగా ఏడు నెలల పాటు ఏడవ స్థానంలో నిలిచింది. అయితే అమ్మకాల్లో జోరు పుంజుకోవడంతో ఐదవ స్థానాన్ని చేరుకుంది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

గడిచిన సెప్టెంబర్ 2016 లో హోండా 91,447 యూనిట్ల సిబి షైన్ అమ్మకాలు జరిపి 32 శాతం వృద్దిని నమోదు చేసింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

హీరో గ్లామర్ అమ్మకాల్లో మంచి వృద్దిని సాధించింది, ఊహించిన భారీ అమ్మకాలతో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ల జాబితాలో ఎనిమిదవ స్థానం నుండి ఆరవ స్థానానికి చేరుకుంది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

గత ఏడాది అమ్మకాలతో పోల్చుకుంటే హీరో గ్లామర్ 45 శాతం అమ్మకాల వృద్దిని సాధించింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

టాప్ 10 జాబితాలో మరో అరుదైన విజయం టీవీఎస్ ఎక్స్ఎల్ అని చెప్పవచ్చు. అత్యత్తుమ పనితీరు కనబరిచే బైకులు మరియు స్కూటర్లకు పోటీగా అమ్మకాలు సాగిస్తోంది టీవీఎస్ ఎక్స్ఎల్.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

ఈ ఏడాది సెప్టెంబర్ అమ్మకాల్లో 78,405 యూనిట్ల ఎక్స్ఎల్ అమ్ముడయ్యాయి. గత ఏడాది అమ్మకాలతో పోల్చుకుంటే 44 శాతం వృద్దిని నమోదు చేసుకుంది టీవీఎస్ ఎక్స్ఎల్.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

బజాజ్ పల్సర్ మంచి పనితీరు కనబరిచే బైకుల్లో ఇదీ ఒకటి. బజాజ్ సంస్థకు ప్రాణం పోసింది పల్సర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

టాప్ 10 జాబితాలో ఆరు నుండి ఎనిమిదవ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ 2 శాతం వృద్దితో గడిచిన 2016 సెప్టెంబర్ అమ్మకాల్లో 68,000 యూనిట్ల పల్సర్ బైకులు అమ్ముడుపోయాయి.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

టీవీఎస్ లో మంచి అమ్మకాలు సాధిస్తున్న ఏకైక స్కూటర్ జూపిటర్. 10 వ స్థానం నుండి ఓ మెట్టు పైకెక్కి తొమ్మిదవ స్థానానికి చేరుకుంది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

గడిచిన 2015 సెప్టెంబర్ మాసంలో 48,866 యూనిట్ల జూపిటర్ స్కూటర్లు అమ్ముడపోగా ఈ యేడు అదే మాసంలో 60,943 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

చివరిగా 10 వ స్థానంలో నిలిచిన బడ్జెట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తి బజాజ్ సిటి100. గడిచిన సెప్టెంబర్ 2016 అమ్మకాల్లో 5 శాతం వృద్దిని కోల్పోయింది.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

గత ఏడాది సెప్టెంబర్ 2015 లో 56,652 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ యేడు అదే మాసంలో 56,406 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్లు మరియు బైకులు

ద్విచక్ర వాహనం పరిశ్రమ ఇప్పుడు బైకుల నుండి స్కూటర్ల మీదకు దృష్టి మళ్లిస్తోంది. కేవలం హోండా మరియు టీవీఎస్ సంస్థలు స్కూటర్ల సెగ్మెంట్లో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. నాణ్యమైన మరియు డబ్బుకు సరైన విలువను జోడించే ఉత్పత్తులకు డిమాండ్ ఎప్పుడు తగ్గదని ఈ రెండు సంస్థలు తమ స్కూటర్ల అమ్మకాలతో నిరూపించాయి.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2016, 12:07 [IST]
English summary
Read In Telugu: Top 10 Selling Two Wheelers In September — Top Spot Ruling For Nine Months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+