టార్క్ ఎలక్ట్రిక్ బైక్ మ్యాజిక్: విడుదలైన 24 గంటల్లో 1000కి పైగా బుకింగ్స్
బెంగళూరు ఆధారిత స్టార్టప్ సంస్థ టార్క్ ఇండియన్ ఎలక్ట్రిక్ బైకుల సెగ్మెంట్లో తమ సరికొత్త టి6ఎక్స్ ఎలక్ట్రిక్ బైకును విడుదల చేసింది. అయితే వినియోహగదారుల నుండి ఊహించని స్పందన లభించింది. కేవలం 24 గంటల్లో సుమారుగా 1000 మందికి పైగా బుక్ చేసుకున్నారు.

టార్క్ సంస్థ విడుదల చేసిన భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైకును సుమారుగా 1000 మందికి పైగా ముందస్తు బుకింగ్‌లు చేసుకున్నారు.

టార్క్ సంస్థ ఈ టి6ఎక్స్ బైకును 1.25 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది.

టార్క్ సంస్థ ఈ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ బైకును ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలైన బెంగళూరు, ఢిల్లీ మరియు పూనేలలో అందుబాటులో ఉండనుంది.

టార్క్ ఈ ఎలక్ట్రిక్ బైకులో లిథియమ్ అయాన్ బ్యాటరీని అందించింది. పూర్తి స్థాయిలో దీనిని ఛార్జ్ చేయడానికి సుమారుగా రెండు గంటల సమయం తీసుకోనుంది.

ఇందులో వినియోగించిన బ్యాటరీ జీవిత కాలం పరంగా చూస్తే, నూతన బ్యాటరీ ద్వారా 80,000 కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేయవచ్చు.

బైకుల్లో మొదటి సారిగా అందించిన ఫీచర్లలో మొబైల్ యాప్ సపోర్ట్ చేసే డిజిటల్ టిఎఫ్‌టి డిస్ల్పే కలదు.

టార్క్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో జియోఫెన్సింగ్, యాంటి థెప్ట్, మొబైల్ ఛార్జింగ్-పోర్ట్, హెల్మెట్ స్టోరేజ్, పగటి పూట వెలిగే లైట్లు, జిపిఎస్ మరియు న్యావిగేషన్ ఫీచర్లు కలవు.

టార్క్ మోటార్ సైకిల్స్ వారు దీనిని కేవలం ఆవిష్కరించారు. అమ్మకాలకు సిద్దంగా విడుదల చేసే సమయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉంది.

టార్క్ మోటార్ సైకిల్స్‌కు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి అని ప్రస్తుతం లభిస్తున్న స్పందన ద్వారా తెలుస్తోంది.

టార్క్ మోటార్ సైకిల్స్‌కు చెందిన తాజా సమాచారం కోసం నిరంతరం ఆటోమొబైల్స్ వార్తలను ప్రచురిస్తున్న డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

- అన్నీ సిద్దం చేసుకున్న సుజుకి ఇక సంచలనాలే
- డీలర్ల వద్దకు చేరిన 2016 టయోటా ఫార్చ్యూనర్
- సముద్రాలపై వీటి వేగానికి అవధులే లేవు...!!


Click it and Unblock the Notifications








