భారత్‌లో విడుదలైన ట్రైయంప్ బైకు బొన్‌విల్ టి120: మరిన్ని వివరాలకు

By Anil

బ్రిటీష్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ ట్రైయంప్ ఇండియన్ మార్కెట్లోకి నేడు బొన్‌విల్ టి120 బైకును విడుదల చేసింది. ఈ ట్రైయంప్ బొన్‌విల్ ధర రూ. 8,70,000 లు ఎక్స్‌ షోరూమ్‌ (ఢిల్లీ)గా ఉంది. దీనికి సంభందించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

ట్రైయంప్ సంస్థ తమ బొన్‌‌విల్ టి120 బైకులో 1200సీసీ కెపాసిటి గల రెండు ఇంజన్‌లు కలవు. ఇది లిక్విడ్ ద్వారా చల్లబడును.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 79 బిహెచ్‌పి పవర్ మరియు 105 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును. ఇది విడుదల చేయు పవర్ మరియు టార్క్‌ను ఇందులోని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వెనుక చక్రానికి అందిస్తుంది.

బ్రేకులు

బ్రేకులు

ఇంతటి శక్తివంతమైన బైకును ఆపడానికి ట్రైయంప్ ఇందులో ముందు వైపున రెండు పిస్టన్ల ఫ్లోటింగ్ కాలిపర్ గల 310 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకు మరియు వెనుక వైపున పిస్టన్ల ఫ్లోటింగ్ కాలిపర్ గల 255 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు కలవు.

సస్పెన్షన్

సస్పెన్షన్

ఇందులో ముందు వైపు కయాబా 120 ఎమ్ఎమ్ ట్రావెల్ గల 41 ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున కూడా 120 ఎమ్ఎమ్ ట్రావెల్ గల షాక్ అబ్జార్వర్ కలదు.

డిజైన్

డిజైన్

ట్రైయంప్ మోటార్ సైకిల్స్ ఈ బొన్‌విల్ టి120 బైకులో గుండ్రటి ఆకారంలో గల హెడ్‌లైటును అందించారు. ఈ లైటు లోపల పగటి పూట వెలిగే లైటు కూడా కలదు. మొత్తానికి ఇది చూడ్డానికి రెట్రో లుక్‌తో కనబడుతుంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో భారీ స్థాయిలో ఇంధన ట్యాంకు కలదు మరియు బైకుకు రెండు వైపులా ఎగ్జాస్ట్ పైపులు కలవు.

ఫీచర్లు

ఫీచర్లు

ఇందులో హీటెడ్ సీట్ మరియు గ్రిప్, వైర్ త్రోటిల్ ద్వారా రైడింగ్ , రెండు రకాల రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్ అసిస్ట్ క్లచ్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు కలవు.

అందుబాటులోకి

అందుబాటులోకి

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ట్రైయంప్ వారి 12 షోరూమ్‌లలో ఈ బొన్‌విల్ టి20 బైకు అందుబాటులో కలదు.

పోటి

పోటి

ప్రస్తుతం ఇండియన్ రోడ్ల మీద ట్రైయంప్ వారి బొన్‌విల్ టి120 బైకుకు ఎలాంటి పోటి లేదు.

మరిన్ని కథనాలు మీ కోసం....

మారుతి సుజుకి వితారా బ్రిజా బుకింగ్స్ ఎన్ని జరిగాయో తెలుసా ?

భారత దేశపు అతి వేగవంతమైన రైలు ఏప్రిల్ 5 నుండి పరుగులు పెట్టనుంది

వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

More from DriveSpark

Article Published On: Tuesday, April 5, 2016, 18:21 [IST]
English summary
Triumph Bonneville T120 Launched In India, Priced At Rs. 8.70 Lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+