విజయవాడలో ట్రయంప్ మోటార్ సైకిల్స్ షోరూమ్ ప్రారంభం
బ్రిటీష్ మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ ట్రయంప్ సెప్టెంబర్ 23, 2016 న విజయవాడలో తమ నూతన షోరూమ్‌ను ప్రారంభించింది. విజయవాడలో లాంఛనంగా ప్రారంభమైన మార్షియల్ మోటార్ సైకిల్స్ షోరూమ్ దేశవ్యాప్తంగా 13 వది అని ట్రయంప్ తెలిపింది.

ట్రయంప్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ట్రయంప్ మోటార్ సైకిల్స్ సిగ్నేచర్ లేఔట్ ఆధారంతో ఈ కొత్త షోరూమ్ భవంతిని డిజైన్ చేశారు. ఇందులో ప్రదర్శన, అమ్మకాలు, కాఫీ పాయింట్, ప్రతినిధులు మరియు కస్టమర్ల సమావేశం వంటి అనే విభాగాలను నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలో ప్రారంభించడిన ఈ షోరూమ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ట్రయంప్ యొక్క సేల్స్, సర్వీసింగ్ మరియు స్పేర్స్ వంటివి సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు.

దేశీయంగా లగ్జరీ బైకుల అమ్మకాల మార్కెట్ పుంజుకుంటోందిని మరియు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను వినియోగదారులు కోరుకుంటున్నారని ట్రయంప్ మోటార్ సైకిల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

భారత దేశపు 13 వ షోరూమ్ విజయవాడలో ట్రయంప్ మోటార్ సైకిల్స్ ప్రారంభపు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

- జిఎస్ఎక్స్150ఆర్ తో మా ప్రతాపమేంటో చూపుతాం...!!
- 1960 లో విడుదలైన 'మంకీ 150' బైకును హోండా మళ్లీ విడుదల చేస్తానంటోంది
- ఎలక్ట్రా బైకు విషయంలో రాయల్ ఎన్పీల్డ్ వెనకడుగు


Click it and Unblock the Notifications








