ఇండియన్ మార్కెట్లోకి థ్రక్ట్సన్ ఆర్‌ను విడుదల చేసిన ట్రైయంప్: ధర 10.90 లక్షలు
బ్రిటిష్‌కు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ట్రైయంప్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త థ్రక్ట్సన్ ఆర్ కేఫ్ రేసర్ బైకును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు (ఢిల్లీ)గా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ట్రైయంప్ మోటార్ సైకిల్స్ సంస్థకు ఉన్న 12 షోరూమ్‌లలో ఇది అందుబాటులో ఉంది.

ట్రైయంప్ థ్రక్ట్సన్ ఆర్
ట్రైయంప్ మోటార్స్ సైకిల్స్ వారు ఈ థ్రక్ట్సన్ బైకులో గుండ్రటి హెడ్ ల్యాంప్ మరియు తో వెనుక వైపు రెండు షాక్ అబ్జార్లతో, పెద్ద పరిమాణం సైలెన్సర్‌తో ఇండియన్ మార్కెట్‌కు కొత్త లుక్‌తో పరిచయం చేసారు.

ఇంజన్ వివరాలు
ఇందులో 1,200 సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్ కూల్డ్ రెండు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

పవర్ మరియు టార్క్
ట్రైయంప్ థ్రక్ట్సన్ బైకు 6,750 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 96 బిహెచ్‌పి పవర్ మరియు 4,950 ఆర్‌ప్ఎమ్ వద్ద 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

మైలేజ్
ఈ థ్రక్ట్సన్ బైకు లీటర్‌కు 21.7 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. మరియు ఇందులోని ఇంధన ట్యాంకులో గరిష్టంగా 14.5 లీటర్ల ఇంధనాన్ని నింపవచ్చు.

బ్రేకులు
ఈ ట్రైయంప్ థ్రక్ట్సన్ బైకులో ముందు వైపున 310 ఎమ్ఎమ్ గల రెండు డిస్క్‌బ్రేకులు, వెనుక వైపున 220 ఎమ్ ఎమ్ డిస్క్ బ్రేకులు కలవు, రెండు బ్రేకులు కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి.

టైర్లు
ముందు వైపు 120/70- 17 అంగుళాల టైరు మరియు వెనుక వైపున 160/60 - 17 అంగుళాల టైరు కలదు.

సస్పెన్షన్
సస్పెన్షన్ పరంగా ఇందులో ముందు వైపున 120 ఎమ్ఎమ్ ట్రావెల్ గల యుఎస్‌డి ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 120 ఎమ్ఎమ్ ట్రావెల్ గల ఏహ్లిన్స్ షాక్ అబ్జార్వర్లు కలవు.

ట్రైయంప్ థ్రక్ట్సన్ బైకులోని ఫీచర్లు
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ట్రాక్షన్ కంట్రోల్
- మూడు రైడింగ్ మోడ్స్ (రోడ్, రెయిన్ మరియు స్పోర్ట్)
- పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు
- ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్
- ఇంజన్ ఇమ్మొబిలైజర్
- అండర్ సీట్ యుఎస్‌బి ఛార్జర్

పోటీ
ట్రైయంప్ థ్రక్ట్సన్ ఆర్ మోటార్ సైకిల్‌కు ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఎలాంటి పోటీ లేదు.

గ్రీన్‌పాయింట్ బోయింగ్ 747-8: విమానమా లేక ఇంధ్ర భవనమా..!
టైటానిక్ యొక్క అసలైన, అరుదైన ఒరిజినల్ ఫోటోలు...!!


Click it and Unblock the Notifications








