ఈ ఏడాదిలో అకులా 310 విడుదలకు సిద్దం చేసిన టీవీఎస్ మోటార్స్
ఇప్పుడిప్పుడే దేశీయంగా నిలుదొక్కుకోవడానికి స్వదేశీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చౌక ఉత్పత్తులను అందివ్వడంలో తనదైన ముద్ర వేసుకున్న టీవీఎస్ ఇప్పుడు పర్ఫామెన్స్ ఉత్పత్తులను విడుదల చేయడానికి సుముఖంగా ఉంది. అందులో భాగంగానే టీవీఎస్ మోటార్స్ 310సీసీ సామర్థ్యం ఉన్న అకులా 310 ను దేశీయంగా విడుదల చేయడానికి సిద్దమైంది.

టీవీఎస్ మోటార్స్ తమ అకులా 310 బైకును వివిధ దశలలో పరీక్షించారు. ఇప్పుడు దీనిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అది కూడా 2016 లోపు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలసింది.

ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్స్ ప్రెసిడెంట్ మరియు సిఇఓ కె.ఎన్.రాధాకృష్ణన్ మాట్లాడుతూ, డీలర్లను లాభపరుస్తూ సుమారుగా 400 కోట్ల మార్కెట్ సొంతం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిపాడు. దేశీయంగా విడి పరికరాలు ఉత్పత్తి చేయడం వలన తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

టీవీఎస్ మోటార్స్ సిఇఓ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ అకులా 310 బైకును ఈ ఆర్థిక సంవత్సరంలోపు విడుదల చేసిన ముందుగా నిర్ణియించుకున్న ఫలితాలను సాధించాలని తెలిపాడు.

అకులా 310 గురించి ప్రస్తావించగా తమ 310 సీసీ బైకు రాయల్ ఎన్ఫీల్డ్ వారి 350సీసీ కి పోటీగా ఉండనుంది అని అన్నారు. డిజైన్ పరంగా ప్రక్కన పెడితే పనితీరులో రాజీ లేని పోటీని ఇస్తుందని తెలుస్తోంది.

టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ సంయుక్తంగా రూపొందిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ కోసం వినియోగించిన ఫ్లాట్‌ఫామ్‌నే అకులా 310 కోసం వినియోగించినట్లు తెలిసింది.

టీవీఎస్ మోటార్స్ మొదటి సారిగా ఈ అకులా 310 రేసింగ్ బైకును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది.

సాంకేతికంగా ఈ అకులా 310 స్పోర్ట్స్ బైకులో 313 సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ లిక్విడ్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 9,500ఆర్‌పిఎమ్ వద్ద 34బిహెచ్‌పి పవర్ మరియు 7,500ఆర్‌పిఎమ్ వద్ద 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

టీవీఎస్ అకులా 310 బైకులో ఫీచర్ల పరంగా ముందు వైపున యుఎస్‌డి ఫ్రంట్ పోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. రెండు వైపులా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

అకులా 310 స్పోర్ట్స్ బైకు యొక్క ధర విషయానికి వస్తే దీని ధర సుమారుగా 2.2 నుండి 2.5 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.

పోటీ పరంగా ఇది ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి390, కవాసకి నింజా 300 మరియు యమహా ఆర్3 వంటి వాటికి పోటీగా నిలవనుంది.

- అసలైన ఇండియన్స్ యొక్క సిసలైన బైకు


Click it and Unblock the Notifications








