బజాజ్ డొమైనర్ 400 కు పోటీని సిద్దం చేసిన టీవీఎస్: విడుదల తేదీ కూడా ఖరారు
టీవీఎస్ మోటార్స్ తమ అకులా 310 మోడల్ బైకు విడుదల చేసింది. రూ. 2 లక్షల లోపు బడ్జెట్లో 2017 మార్చి నాటికి విడుదలను ఖాయం చేసినట్లు రిపోర్ట్‌లు చెబుతున్నాయి.
టీవీఎస్ అకులా 310 ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ - మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న టీవీఎస్ అకులా 310 బైకు విడుదలను టీవీఎస్ దాదాపుగా ఖరారు చేసింది. ఇది ఎలా ఉంటుందని ఓ వైపు కస్టమర్లు మరియు దీనిని మార్కెట్ ఎలా ఉంటుందో అని టూ వీలర్ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలున్న దీనిని బజాజ్ వారి కొత్త బైక్‌కు పోటీనిస్తూ , రెండు లక్షల బడ్జెట్లో విడుదలకు సిద్దమవుతోంది.

టీవీఎస్ టూ వీలర్స్ దిగ్గజం ఈ అకులా 310 మోడల్ ను 2016 ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది

వివిధ రకాల ఆధారాల ప్రకారం, టీవీఎస్ టూ వీలర్స్ తమ అకులా 310 ను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది మార్కెట్లోకి విడుదలయితే కెటిఎమ్ ఆర్‌సి390, ఆర్3 మరియు త్వరలో విడుదల కానున్న బెనెల్లీ టొరాండో 300 మోడళ్లకు గట్టిపోటీనివ్వనుంది.

టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ సంయుక్తంగా అభివృద్ది చేస్తోన్న జి310ఆర్ ఉత్పత్తిలోని అనేక అంశాల జోడింపుతో అకులా 310 రూపొందుతోంది. అయితే ఈ జి310ఆర్ ను కూడా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు.

జి310ఆర్ లో ఉన్న అదే ఇంజన్, ఛాసిస్, స్వింగ్ ఆర్మ్ మరియు అనేక సాంకేతిక శరీర భాగాలను అకులా 310 లో టీవీఎస్ అందిస్తోంది.

ప్రస్తుతం టీవీఎస్ అకులా బైకులో 310సీసీ ఇంజన్, బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ లోని 313సీసీ సామర్థ్యం ఉన్న వాటర్ కూల్డ్ సింగల్ సిలిండర్ వలె 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

అకులాలోని ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేస్తున్నారు. జి310ఆర్ తో పోల్చుకుంటే అకులాలో వేరే ట్రాన్స్‌మిషన్ అందిస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి చేసే పవర్ లో స్వల్ప తేడా ఉంటుంది.

ఫీచర్ల పరంగా రెండు వైపులా డిస్క్ బ్రేకులు, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్, 17-అంగుళాల టైర్లు మరియు డ్యూయల్ ఛానల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

గతంలో టీవీఎస్ ఫ్లాంటు ఉన్న హోసూర్ రహదారులపై ఈ అకులా 310 ను పరీక్షించారు. అదే ప్లాంటులో అకులా 310 మరియు బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ఉత్పత్తి జరగనుంది.

- బజాజ్ నుండి మరో సంచలనాత్మక మోడల్
- స్కూటర్ల రాజ్యం: మార్కెట్లోకి దూసుకొస్తున్న స్కూటర్లు
- BMW నుండి అత్యంత చౌకైన 125సీసీ బైకు


Click it and Unblock the Notifications








