టివీఎస్ అకులా 310 టీసర్: త్వరలో విడుదల...
ఉత్తమ ఫలితాలను సాధించే సామర్థ్యం ఉన్న టీవీఎస్ మోటార్స్ వారి అకులా 310 బైకు సంభందించిన టీసర్‌ను టీవీఎస్ ట్విట్టర్ సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేశారు. టీవీఎస్ ఈ బైకును ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది.
టీవీఎస్ అకులా 310 సూపర్ గురించి మరిన్ని వివరాలు...

నిండైన రేసింగ్ ఫీచర్లున్న లక్షణాలతో రూపొందిన ఈ అకులా 310 బైకును ఈ ఏడాదిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిని అపాచే 300 అనే పేరుతో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

టీవీఎస్ మోటార్స్ యొక్క రేసింగ్ బృందం అభీష్టం మేరకు దీనిని అకులా అనే పేరుతో విడుదల చేయనున్నారు. సుమరుగా 33 సంవత్సరాల రేసింగ్ చరిత్రను కలిగి ఉంది ఈ సంస్థ.

సాంకేతికంగా ఈ అకులా 310 స్పోర్ట్స్ బైకులో 313 సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ లిక్విడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 9,500ఆర్‌పిఎమ్ వద్ద 34బిహెచ్‌పి పవర్ మరియు 7,500ఆర్‌పిఎమ్ వద్ద 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇది లీటర్‌కు 36 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వనుంది.

టీవీఎస్ అకులా 310 బైకులో ఫీచర్ల పరంగా ముందు వైపున యుఎస్‌డి ఫ్రంట్ పోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. రెండు వైపులా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

అకులా 310 స్పోర్ట్స్ బైకు యొక్క ధర విషయానికి వస్తే దీని ధర సుమారుగా 2.2 నుండి 2.5 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.

పోటీ పరంగా ఇది ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి390, కవాసకి నింజా 300 మరియు యమహా ఆర్3 వంటి వాటికి పోటీగా నిలవనుంది.

- ఇండియన్ మార్కెట్లో రెండు లక్షల లోపు ధరతో అందుబాటులో ఉన్న ఏడు సూపర్ బైకులు: పూర్తి వివరాలకు


Click it and Unblock the Notifications








