వెంకన్నకు రెండు కోట్లు రుపాయలు సమర్పించిన టీవీఎస్ మోటార్స్
భారత దేశపు మూడవ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరియు దాని అనుభందం సంస్థ సుందరం క్లేటాన్ సంయుక్తంగా శ్రీ తిరుమల వేంకటేశ్వరునికి రెండు కోట్ల రుపాయలను సమర్పించారు. రెండు సంస్థలు ఉమ్మడిగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టిటిడి అధికారులకు సమర్పించుకున్నారు.

టీవీఎస్ మోటార్స్ సిఇవో శ్రీ కె ఎన్ రాధాకృష్ణన్ మరియు సుందరం క్లేటాన్ సంస్థ సిఇవో టి ఎ రఘునాథన్ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణా అధికారి డి సాంబశివరావు గారికి ఆలయంలో డిడి ని అందజేశారు.
తిరుమలలో టిటిడి చేత నిర్వహించబడుతున్న వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ లో యాత్రికుల ఉచిత భోజన సదుపాయానికి తాము అందించే సొమ్మును ఖర్చు చేయాలని టీవీఎస్ మోటార్స్ మరియు సుందరం క్లేటాన్ సంస్థలు తెలిపాయి.


Click it and Unblock the Notifications








