భారతీయ మార్కెట్లోకి ఆపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు విడుదల చేసిన టీవీఎస్
టీవీఎస్ మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి సరికొత్త అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకును విడుదల చేశారు. గత వారంలో దీనికి రహస్యంగా పరీక్షలు నిర్వహించారు. అయితే అధికారికంగా నేడు టీవీఎస్ టూ వీలర్స్ వారు దీనిని 88,990 రుపాయల వద్ద విడుదల చేశారు.
టీవీఎస్ వారి సరికొత్త అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ధరలు
- టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి (కార్బోరేటర్) ధర రూ. 88,990/-
- టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి (ఫ్యూయల్ ఇంజెక్షన్) ధర రూ. 1.07 లక్షలు
- టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి (ఎబిఎస్) ధర రూ. 1.15 లక్షలు
- టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
- రెండు వైపులా డిస్క్ బ్రేకులు
- డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్
- పగటి పూట వెలిగే లైటు
- ల్యాంప్ టైమర్
- సర్వీస్ రిమైండర్
- స్ల్పిట్ సీటు
- గేర్ పొజిషన్ ఇండికేటర్
- అల్లాయ్ వీల్స్
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- మరియు ఇది పిరెల్లీ టైర్లను కలిగి ఉంది
- మార్కెట్లోకి విక్టర్ టూవీలర్‌ను 49,490 లకే విడుదల చేసిన టీవీఎస్
- గత నెలలో ఎక్కువ మంది భారతీయులు ఎంచుకున్న కార్లు
- ఎస్-క్రాస్ మీద తగ్గిన ధరలు: 2,05,000 ల తక్కువ ధరతో అందుబాటులో
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

ఇంజన్
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో 197 సీసీ కెపాసిటి గల ఆయిల్ మరియు ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

పవర్
ఇందులో ఉన్న సింగల్ సిలిండర్ ఇంజన్ దాదాపుగా 21 బిహెచ్‍పి పవర్ మరియు 18 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును (ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ను వినియోగించినపుడు). కార్బోరేటర్ ను ఉపయోగించినపుడు 20 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్ బాక్స్
టీవీఎస్ మోటార్స్ వారు అపాచే ఆర్‌టిఆర్ 200 4విలో గల ఇంజన్‌కు 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇది కేవలం 3.9 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫీచర్లు

ఫీచర్లు

ఫీచర్లు

పోటి
ప్రస్తుతం ఇది కెటిఎమ్ డ్యూక్ 200 మరియు పల్సర్ ఎఎస్200 వంటి మోడల్ బైకులకు పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications








