రహస్యంగా లీక్ అయిన టివిఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 ఫోటోలు
టివీఎస్ స్కూటర్స్ మరియు టూ వీలర్స్ వారు మార్కెట్లోకి తమ అపాచే ఆర్‌టిఆర్ 200 ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ అపాచే ఆర్‌టిఆర్ 200 బైకును జనవరి 20, 2016 న విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దీనిని టివీఎస్ వారు తమ హోసుర్ ప్లాంట్ ద్వారా తయారీని ప్రారంభించింది.
టివీఎస్ వారు ఈ అపాచే ఆర్‌టిఆర్ 200 బైకును పరీక్షిస్తుండగా కొన్ని ఫోటోలు రహస్యంగా విడుదల చేశారు. అయితే ఫోటోలను మరియు ఆర్‌టిఆర్ 200 గురించి ఓ లుక్కేద్దామా...!

ఇంజన్
టివీఎస్ వారు దీనికి సంభందించి టెక్నికల్ విషయాలు లీక్ కాకుండా బాగానే జాగ్రత్తపడ్డారు. అయితే ఇందులో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉన్నట్లు తెలిసింది. ఇది కెటిఎమ్ డ్యూక్ లోని లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కన్నా కొంచెం మెరుగ్గానే ఉండనుంది.
ఫోటోలు: మోటొరాయిడ్స్

ట్రాన్స్‌మిషన్
టివీఎస్ వారి అపాచే ఆర్‌టిఆర్ 200 బైకులో గల ఇంజన్ దాదాపుగా 25 బిహెచ్‌పి పవర్ మరియు 22 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయగలదు. ఇందులోని ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో రానుంది.
ఫోటోలు: టీమ్ బిహెచ్‌పి

సస్పెన్షన్
ఇందులో పెటల్ డిస్క్ బ్రేక్స్ కలవు. ముందు వైపున టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుకవైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు.
ఫోటోలు: మోటొరాయిడ్స్

ఇందులో కొత్తవి
ఈ ఆర్‌టిఆర్ 200 లో రెండు పీసుల హ్యాండిల్ బార్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, కొత్తగా ఉన్న ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్ మరియు ఎత్తులో ఉన్న సీటు.
ఫోటోలు: మోటొరాయిడ్స్

పోటి
టివీఎస్ వారి అపాచే ఆర్‌టిఆర్ 200 బైకు మార్కెట్లోకి విడుదల అయితే కెటిఎమ్ డ్యూక్ 200, బజాజ్ పల్సర్ మరియు బెనెల్లీ టియన్‌టి 25 వంటి వాటికి పోటిగా నిలుస్తుంది.
ఫోటోలు: ఐడబ్ల్యూబి

ప్రస్తుతం
200సీసీ బైకుల సెగ్మెంట్లో ఆస్ట్రియన్ కు చెందిన కెటిఎమ్ వారి డ్యూక్ 200 ఓ వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. అయితే టివీఎస్ వారి అపాచే ఆర్‌టిఆర్ మార్కెట్లోకి రంగప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.
ఫోటోలు: ఐడబ్ల్యూబి

టివీఎస్ అపాచే వారి ఆర్‌టిఆర్ 200 బైకు యొక్క రహస్య ఫోటోలు...
ఫోటోలు: పవర్ డ్రిఫ్ట్

టివీఎస్ అపాచే వారి ఆర్‌టిఆర్ 200 బైకు యొక్క రహస్య ఫోటోలు...
ఫోటోలు: మోటొరాయిడ్స్

- 2016 సంవత్సరానికి ఎనిమిది విభిన్న రంగుల్లో అందుబాటులోకి రానున్న రాయల్ ఎన్ఫీల్డ్
- చెన్నైలో బిఎమ్‌డబ్ల్యూ, ఆడి మరియు ఫోర్షే కార్లు వేలం: ప్రారంభ ధర 5 లక్షలు: ఇక్కడ క్లిక్ చేయండి
- 682 భోగీలు, 8 ఇంజన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు: క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








