ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డ్‌కు ఎంపికైన అపాచే ఆర్‌టిఆర్
2017 ఏడాదికి గాను ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఎంపికయ్యింది.
దేశీయ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకు 2017 ఏడాదికి గాను ఇండియన్ బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.

ఆటోమోటివ్ జర్నలిస్టుల బృందం టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోడల్‌ను విభిన్న అంశాల పరంగా పరీక్షించి ఈ ప్రతిష్టాత్మక ఇండియన్ బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌కు ఎంపిక చేసింది.

ధర, మైలేజ్, డిజైన్, సౌకర్యం, పనితీరు, భద్రత, సాంకేతిక ఆవిష్కరణ, డబ్బుకు తగ్గ విలువలు మరియు భారతీయ రోడ్లకు సరిపోయే సాధ్యాసాద్యాలను పరిశీలించిన పిమ్మట దీనిని ఈ అవార్డ్‌కు ఎంపిక చేయడం జరిగిందని జ్యూరీ సభ్యులు తెలిపారు.

2017 ఏడాది ఇండిన్ బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి తో పాటు బజాజ్ వి15, డిఎస్‌కె బెనెల్లీ టిఎన్‌టి25, హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ 110, హీరో అచీవర్ 150, హోండా నవీ, హోండా సిబి హార్నెట్ 160ఆర్, కవాసకి వెర్సేస్ 650 ఏబియస్, రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్, టీవీఎస్ విక్టర్, యుఎమ్ రెనిగేడ్ కమాండో/స్పోర్ట్ ఎస్ మరియు యమహా సెల్యూటో ఆర్ఎక్స్ వంటి బైకులు పోటీపడ్డాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ప్లాగ్‌షిప్ మోడల్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకును జనవరి 2016 లో మార్కెట్లోకి విడుదల చేసింది. 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద టీవీఎస్ ప్రదర్శించిన డార్కెన్ ఎక్స్21 కాన్సెప్ట్ ఆధారంగా అపాచే ఆర్‌టిఆర్ బైకును డిజైన్ చేసింది టీవీఎస్.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో 197.75సీసీ సామర్థ్యం గల ఆయిల్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 20.3బిహెచ్‌పి పవర్ మరియు 18.1ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.

148 కిలోల బరువున్న ఈ బైకు కేవలం 3.95 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 127కిలోమీటర్లుగా ఉంది.

టీవీఎస్ ప్రస్తుతం కార్బోరేటర్ అనే వర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో దీనిని ఫ్యూయల్ ఇంజక్టెడ్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వేరియంట్లలో పరిచయం చేయనున్నారు.

రైడింగ్ చేస్తున్నపుడు అత్యుత్తమ పటిష్టత్వాన్ని కలిగి ఉండేందుకు దీనిని డబుల్ క్రాడిల్ స్ల్పిట్ సింక్రో స్టిఫ్ ఫ్రేమ్ ఆధారంతో నిర్మించారు. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోడల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 88,990 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

- డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్
- జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!
- మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?


Click it and Unblock the Notifications








