అసాధారణ వృద్దిని సాధించిన టీవీఎస్ మోటార్స్

By Anil

దేశీయ రెండవ అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ గడిచిన 2016 ఏప్రిల్ నెలలో ఏకంగా 16 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. ఈ వృద్దిలో మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్ల రెండింటి అమ్మకాలు కూడా భాగమయ్యాయి. ఇందులో మోటార్ సైకిళ్ల నుండి 20.7 శాతం మరియు స్కూటర్ల నుండి 28.03 శాతం అమ్మకాల వృద్దిని సాధించినట్లు టీవీఎస్ మోటార్స్ ఓ ప్రకటనలో తెలియజేసారు.

టీవీఎస్ మోటార్స్

టీవీఎస్ మోటార్స్ గత ఏడాదిలో ఏప్రిల్ నెలలో 1,95,937 యూనిట్లు అమ్మకాలు సాధించగా ఈ ఏడాదిలో ఏప్రిల్ నెలలో చెన్నై ఆధారిత టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ఏకంగా 2,27,096 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అత్యంత పోటి పరిస్థితులలో కూడా భారీ స్థాయిలో అమ్మకాలు చేపట్టి గత ఏడాది అమ్మకాల కన్నా 16 శాతం ఆధిక్య వృద్దిని సాధించింది.
Also Read: రైలు ప్రయాణం మనకు ఎంతో ఆనందం..... కాని రైలు నడిపే వారికి అదో నరకం...!!
దేశీయ అమ్మకాలు మాత్రమే కాదు ఎగమతులు కూడా ఆటోమొబైల్ సంస్థలకు ముఖ్యమైన విభాగం. అయితే టీవీఎస్ మోటార్స్ గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే 13 శాతం తక్కువ వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఈ ఏడు ఏప్రిల్ లో 28,354 యూనిట్ల ఎగుమతులు జరిగాయి. దేశీయ పరిజ్ఞానంతో పరుగులు తీస్తున్న టీవీఎస్ సంస్థ ఈ అమ్మకాల జోరును ఇలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానం గురించి ఆశ్చర్యకర నిజాలు

More from DriveSpark

Article Published On: Tuesday, May 10, 2016, 15:14 [IST]
English summary
TVS Motors Record 16 Percent Growth During April 2016
Read more on: #టీవీఎస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+