టీవీఎస్ స్కూటర్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా ? అయితే ఇదే సరైన సమయం
దక్షిణ భారత దేశంలో పండుగ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టీవీఎస్ మోటార్స్ తమ శ్రేణిలో ఉన్న విసృతమైన ఉత్పత్తుల మీద డిస్కౌంట్లు మరియు ఆఫర్లను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్ల వద్ద టీవీఎస్ ఉత్పత్తుల మీద ప్రకటించిన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

టీవీఎస్ మోటార్స్ తమ శ్రేణిలో ఉన్న స్కూటర్ల మీద గరిష్టంగా 2,500 రుపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

అదే విధంగా స్కూటర్లకు కావాల్సిన యాక్ససరీలు దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. అందులో హెల్మెట్, స్టీల్ గార్డ్, హ్యాండిల్ గ్రిప్స్, సీట్ కవర్, లైసెన్స్ ప్లేట్ మరియు పార్కింగ్ కవర్.

ప్రస్తుతం టీవీఎస్ మోటార్స్ తమ స్కూటర్ల రేంజిలో వీగో, జూపిటర్, స్కూటి పెప్ ప్లస్ మరియు స్కూటీ జస్ట్100 ఈ నాలుగింటి మీద పండుగ సీజన్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా టీవీఎస్ మోటార్స్ అందిస్తున్న ఈ ఆఫర్లు కేవలం లిమిటెడ్ పీరియడ్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

త్వరలో టీవీఎస్ మోటార్స్ స్కూటర్ల మీద ఆఫర్లు ప్రకటించిన విధంగా కమ్యూటర్ బైకుల మీద కూడా ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించనుంది.

- 30 ఏళ్లలో ఒక్క ప్రాణం కూడా పోలేదు: ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్


Click it and Unblock the Notifications








