పుంజుకుంటున్న టీవీఎస్ అమ్మకాలు
దక్షిణ భారత ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ అమ్మకాల పరంగా నిలకడైన వృద్దిని సాధించింది. జూన్ 2016 లో తమ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరంగా 11 శాతం వృద్దిని సాధించింది. ఎగుమతులు కాస్త నిరాశపరిచినప్పటికీ దేశీయ ఆశించిన ఫలితాలను నమోదు చేసుకుంది.
Also Read: రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రేతాత్మలు...
టీవీఎస్ వారి స్కూటర్ల సెగ్మెంట్లో స్కూటీ పెప్ మరియు వీగో లతో పోటీ పడుతూ చివరికి బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్‌గా నిలిచింది జూపిటర్. అదే విధంగా క్రితం ఏడాది జూన్ 2015 తో పోల్చుకుంటే టీవీఎస్ స్కూటర్ల అమ్మకాలు 10.3 శాతం మేర పెరిగాయి. అలాగే గడిచిన జూన్ 2016 లో 67,539 అమ్మకాలు జరపగా అంతుకు ముందు జూన్ 2015 లో 61,215 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

టీవీఎస్ మోటార్స్ మోటార్ బైకుల అమ్మకాల పరంగా జూన్ 2015 తో పోల్చుకుంటే జూన్ 2016 లో 7.6 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. మోటార్ సైకిల్స్ అమ్మకాల్లో ఆపాచే శ్రేణి ఉత్పత్తులు మరియు విక్టర్ బైకులు అధిక అమ్మకాలను సాధించాయి.
Also Read: ఇక్కడ విమానం దింపాలంటే ఆ ఎనిమిది మంది మాత్రమే అర్హులు
త్రీ వీలర్స్ అమ్మకాల్లో టీవీఎస్‌కు ఈ సారి చేదు అనుభవం ఎదురైంది. జూన్ 2015 లో 11,097 యూనిట్లు అమ్మకాలు జరగగా వాటి కన్నా తక్కువగా జూన్ 2016 లో 7,128 యూనిట్లు అమ్మకాలు నమోదయ్యాయి. త్రీ వీలర్స్ మార్కెటింగ్ మంచి అవకాశాలున్న ఇండియాలో వీటి అమ్మకాలు పెంచడానికి టీవీఎస్ ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications








