సరికొత్త 125సీసీ స్కూటర్ విడుదల చేయనున్న టీవీఎస్

టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త 125సీసీ స్కూటర్ ను అభివృద్ది చేస్తోంది. నూతన బ్రాండ్ పేరుతో 2017 నాటికి దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

By Anil

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త 125సీసీ స్కూటర్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. దీనిని వచ్చే 2017 నాటికి అమ్మకాలకు సిద్దం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం స్కూటర్ల సెగ్మెంట్లో ఇతర సంస్థల ఉత్పత్తుల నుండి ఎదుర్కొంటున్న తీవ్ర పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడేందుకు టీవీఎస్ నూతన ఉత్పత్తుల మీద దృష్టి సారించింది.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

ప్రస్తుతం టీవీఎస్ మోటార్స్ కు చెందిన రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ కేంద్రాలు నూతన పరిజ్ఞానంతో సరికొత్త ఉత్పత్తుల అభివృద్ది మీద ఎక్కువ దృష్టిని పెట్టాయి.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

దేశీయ పరిజ్ఞానంతో ముందుకు వెళుతున్న టీవీఎస్ బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్‌తో కలిసింది. ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్తులో తక్కువ కెపాసిటి గల మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

సమాచార వర్గాల కథనం మేరకు, టీవీఎస్ సరికొత్త 125సీసీ సామర్థ్యం గల స్కూటర్‌ను అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సరికొత్త స్కూటర్ల శ్రేణి పరిచయంతో బ్రాండ్ పేరును మరింత పెంచే ఆలోచనలో కూడా టీవీఎస్ ఉంది.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

ప్రస్తుతం టీవీఎస్ స్కూటర్ల లైనప్‌లో అత్యధిక అమ్మకాలు సాధిస్తోంది కేవలం జూపిటర్ మాత్రమే. అయితే అత్యుత్తమ అమ్మకాలు సాధించే మరో ఉత్పత్తిని రూపొందించుకునే పనిలో ఉంది టీవీఎస్. దీనిని కూడా జూపిటర్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

టీవీఎస్ తమ 125సీసీ స్కూటర్ల లైనప్‌ను పెంచుకోవడం ద్వారా 110సీసీ సామర్థ్యం కన్నా మరింత శక్తివంతమైన లైనప్‌కు శ్రీకారం చుట్టినట్లే. ఇప్పుడు మంచి కెపాసిటి గల స్కూటర్ల మీద వినియోగదారులు ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో 125సీసీ ఉత్పత్తులకు గిరాకీ పెరగనుంది.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

దేశీయంగా ఉన్న 125సీసీ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్ అగ్ర స్థానంలో ఉంది. గత దశకం నుండి అమ్మకాల్లో మంచి వృద్దిని సాధిస్తోంది. మరియు వీటికి హోండా ఆక్టివా 110సీసీ ఉత్పత్తులు కూడా గట్టి పోటీగా నిలుస్తున్నాయి.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

125సీసీ సామర్థ్యం గల ఉత్పత్తుల అమ్మకాల్లో హీరో మోటోకార్ప్ మరియు యమహా మోటార్ ఇండియా కంపెనీలు ముందజలో ఉన్నాయి. మొత్తం మీద స్కూటర్ల మార్కెట్లో హోండా తమ ఆక్టివా శ్రేణి ఉత్పత్తుల ద్వారా మంచి ఫలితాలను సాధిస్తోంది.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

ప్రస్తుతం టీవీఎస్ తీసుకున్న నూతన 125సీసీ ఉత్పత్తుల అభివృద్ది ద్వారా దేశీయంగా ఉన్న సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా మరియు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సంస్థలకు చెందిన 125సీసీ స్కూటర్లకు గట్టి పోటీని సృష్టించనుంది.

టీవీఎస్ నుండి సరికొత్త 125సీసీ స్కూటర్

  • డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్
  • ఎస్‌యువిని కొంటున్నారా ? వీటి విడుదలకు కాస్త ఆగండి..!!

More from DriveSpark

Article Published On: Thursday, November 10, 2016, 13:57 [IST]
English summary
TVS Working On A New 125CC Scooter — To Launch New Scooter Brand
Read more on: #టీవీఎస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+