టివీఎస్ యాడ్‌లో పంచెకట్టుతో కనువిందు చేసిన ధోని ప్రభుదేవా
సంక్రాంతికి వినియోగదారులను తమ బుట్టలో వేసుకోవడానికి చాలా వాహన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. గడిచిన ఏడాదిలో పండుగ సీజన్‌లో అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం సంక్రాంతి పండుగ వేడుకలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ధోని మరియు ప్రభుదేవా ఇద్దరూ కూడా బుల్లి తెర మీద వేడుక చేయనున్నారు. మరిన్ని విశేషాలు క్రింది కథనంలో...

టీవీఎస్ వారికి ఎక్కువ మంది వినియోగదారుల మన తెలుగు రాష్ట్రాల నుండే ఉన్నారు కాబోలు. ఎందుకంటే ధోని మరియు ప్రభుదేవా ఇద్దరూ పంచెకట్టులో ఇది కూడా తెలుగు బుల్లి తెర కనిపించనున్నారు.

ఇందులో ధోని మరియు ప్రభుదేవా ఇద్దరూ ఒక టీవీలర్ షోరూమ్‌లో తమ పంచెకట్టు ద్వారా డ్యాన్స్ చేశారు.

దక్షిణాది నుండి ప్రభుదేవా మరియు ఉత్తరాది నుండి ధోని ఇద్దరూ కలసి ఇలా యాడ్‌లో పాల్గొనడం ద్వారా సంక్రాతికి టూ వీవలర్ల అమ్మకాలు జోరందుకుంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

అయితే వీరిరువురూ కూడా టీవీఎస్ వారి స్టార్ సిటి టూ వీలర్ కు ప్రచారం చేశారు. టీవీఎస్ స్టార్ సిటి గురించి మరిన్ని వివరాలు తరువాత సెక్షన్‌లో...

టీవీఎస్ స్టార్ సిటి ప్లస్ టూ వీలర్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 45,000 లు(ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది

ఇందులో 109.7సీసీ కెపాసిటి గల ఎకోథ్రస్ట్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 8.3 హార్స్ పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలగి ఉంది. ఇది కేవలం ఎనిమిది సెకండ్ల కాలంలోనే 0 నుండి 60 కిలో మీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని అత్యధిక వేగం గంటకు 90 కిలోమీటర్లు.

టీవీఎస్ వారి కథనం ప్రకారం ఈ సరికొత్త స్టార్ సిటి ప్లస్ టూ వీలర్ లీటర్‍కు దాదాపుగా 85 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ని ఇస్తుందని తెలిపారు.

ప్రత్యేకతలు
ఈ బైకులో అల్లాయ్ వీల్స్, డ్రమ్ బ్రేకులు మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ కలవు.
ధోని మరియు ప్రభుదేవా పంచె కట్టులో కనువిందు చేసిన వీడియో క్లిప్...


Click it and Unblock the Notifications








