కొత్త రంగు, కొత్త ధరలతో టీవీఎస్ స్టార్ సిటి ప్లస్
టీవీఎస్ మోటార్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి చాకొలేట్ గోల్డ్ ఎడిషన్ 2016 స్టార్ సిటి ప్లస్ బైకును విడుదల చేసింది. కొత్త రంగు మరియు అదనపు ఆకర్షణలతో పాటు అందుబాటులోకి వచ్చిన ఈ బైకు వినియోగదారులకు రంగుల పరంగా దీనిని ఎంచుకునే అవకాశం కలిగింది. దీని గురించి మరిన్ని వివరాల కోసం....

చాకొలేట్ గోల్డ్ ఎడిషన్ 2016 స్టార్ సిటి ప్లస్ ఎడిషన్ బైకు ధర రూ. 49,234 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఇందులో టీవీఎస్ మోటార్స్ 110 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఈ శక్తివంతమైన ఇంజన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.30 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‍పిఎమ్ వద్ద 8.70 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్ 4-స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు అందుతుంది.

ఫీచర్ల పరంగా ఇందులో డిజిటల్ గేజ్, పొడవైన వీల్ బేస్, వెడల్పాటి వెనుక టైరు, అనలాగ్ స్పీడో మీటర్ వంటివి కలవు.

ప్రస్తుతం ఈ 2016 లిమిటెడ్ చాకొలేట్ గోల్డ్ ఎడిషన్ స్టార్ సిటి ప్లస్ బైకు దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని ఎంచుకోదగ్గ షోరూమ్‌లలో అందుబాటులో ఉంది.

ఈ స్టార్ సిటి ప్లస్ నూతన రంగుతో పాటు ముందున్న ఇతర రంగుల్లో యథావిధిగా అందుబాటులో ఉంటుంది.

బడ్జెట్ బాయ్స్‌కు పక్కా కారు.....డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
ఇంటికో బైకు కాదు..! ఇంటికో జెట్ విమానం..!!


Click it and Unblock the Notifications








