టీవీఎస్ విక్టర్ మార్కెట్లోకి రీ ఎంట్రీ: ప్రారంభ ధర రూ. 51,600

By Anil

పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో మోటార్ సైకిళ్లను తయారు చేస్తున్న స్వదేశీ సంస్థ టీవీఎస్ క్రితం రోజున బెంగుళూరు వేదికగా తమ లేటెస్ట్ విక్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. టీవీఎస్ ఈ ఏడాది జనవరి 20న తమ నూతన విక్టర్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇది అమ్మకాలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.

టీవీఎస్ వారి లేటెస్ట్ విక్టర్‌ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

టీవీఎస్ విక్టర్ ధరలు

టీవీఎస్ విక్టర్ ధరలు

విక్టర్ యొక్క బేస్ వేరియంట్ డ్రమ్ బ్రేకులను కలిగి ఉన్నది ధర రూ. 51,600 మరియు డిస్క్ బ్రేకులను కలిగి ఉన్న దాని ధర రూ. 53,600 లు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు)గా ఉన్నాయి

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

టీవీఎస్ మోటార్స్ వారు తమ అప్‌డేటెడ్ ఎడిషన్ విక్టర్ బైకులో 109.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు.

పవర్ మరియు టార్క్ వివరాలు

పవర్ మరియు టార్క్ వివరాలు

ఇందులో 110 సీసీ కెపాసిటి గల శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 9.4 బిహెచ్‌పి పవర్ మరియు 9.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గేర్‌బాక్స్

గేర్‌బాక్స్

అయితే ఇంజన్ విడుదల చేయు మొత్తం పవర్ 4-స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా చైన్ డ్రైవ్ సహాయంతో వెనుక చక్రాలకు అందుతుంది.

ఇంధన ట్యాంకు సామర్థ్యం

ఇంధన ట్యాంకు సామర్థ్యం

టీవీఎస్ వారి సరికొత్త విక్టర్ కేవలం 112 కిలో బరువును మాత్రమే మోయగలదు మరియు ఇది 8-లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకును కలిగి ఉంది.

 మైలేజ్

మైలేజ్

ఈ విక్టర్ బైకు లీటర్‌‌కు 76 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

సస్పెన్షన్

సస్పెన్షన్

టీవీఎస్ తమ విక్టర్ బైకులో ముందు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున రెండు షాక్ అబ్జార్వర్లను అందించారు.

ఈ సెగ్మెంట్లో మొదటిసారిగా

ఈ సెగ్మెంట్లో మొదటిసారిగా

ఇందులో మొదటిగా సారిగా హజార్డ్ లైట్లను అందించారు మరియు ముందు మరియు వెనుక వైపున స్పోక్స్ చక్రాల స్థానంలో అల్లాయ్ వీల్స్‌ను కల్పించారు.

లభించు రంగులు

లభించు రంగులు

టీవీఎస్ వారి ఈ సరికొత్త విక్టర్ బైకు ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

  • రెస్ట్‌పుల్ రెడ్
  • జెనరస్ గ్రే
  • బ్లిస్‌ఫుల్ బ్లూ
  • సెరెని సిల్వర్
  • బ్యాలెన్స్‌డ్ బ్లాక్ రెడ్
  • బీటిఫిక్ బ్లాక్ సిల్వర్
  • పోటి

    పోటి

    ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరో స్ల్పెండర్, బజాజ్ సిటి100 మరియు హోండా వారి డ్రీమ్ యుగా వంటి వాటికి పోటీగా నిలవనుంది.

    టీవీఎస్ లేటెస్ట్ విక్టర్ రీ ఎంట్రీ
    • రూ. 27,668 లకే బజాజ్ సిటి100 బైకు
    • దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

More from DriveSpark

Article Published On: Thursday, March 10, 2016, 13:02 [IST]
English summary
TVS Victor Launched In Bangalore, Prices Start At Rs. 51,600
Read more on: #టీవీఎస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+