మార్కెట్లోకి విక్టర్ టూవీలర్‌ను 49,490 లకే విడుదల చేసిన టీవీఎస్
టీవీఎస్ టూ వీలర్స్ వారు దేశీయ ద్విచక్రాల మార్కెట్లోకి బాగా పేరు మోసిన విక్టర్ టూ వీలర్ ను విడుదల చేశారు. 2001 లో విడుదల చేసిన విక్టర్ అప్పట్లో మంచి అమ్మకాలు నమోదు చేసుకుంది. టీవీఎస్ వారు ఈ విక్టర్ కు కొన్ని మార్పులు చేసి తిరిగి మార్కెట్లోకి విడుదల చేసింది.
టీవీఎస్ విక్టర్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

టీవీఎస్ విక్టర్ ధరలు
- టీవీస్ విక్టర్ డ్రమ్ బ్రేక్ ధర రూ. 49,490
- టీవీఎస్ విక్టర్ డిస్క్ బ్రేక్ ధర రూ. 51,490
- టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
- రెండు షాక్ అబ్జార్వర్లు
- అల్లాయ్ వీల్స్
- స్టాండర్డ్ ల్యాంప్స్
- డ్రమ్ బ్రేకులు (ఆప్షనల్ గా)
- 8 లీటర్ల ఇంధన సామర్థ్యం
- మహీంద్రా గస్టో రివ్యూ: ఇలాంటి ఫీచర్లును ఇతర స్కూటర్లలో చూశారా?
- 2016 ఆటో ఎక్స్ పోలో 150సీసీ స్కూటర్‌ను ప్రదర్శించనున్న హోండా టూవీలర్స్
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)

ఇంజన్
టీవీఎస్ విక్టర్ లో 110సీసీ గల సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది లిక్విడ్ మరియు ఎయిర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉండనుంది.

పవర్
విక్టర్ లో గల శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 9.4 బిహెచ్‌పి పవర్ మరియు 9.4 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ఉత్తత్తి చేస్తుంది.

ట్రాన్స్ మిషన్ మరియు మైలేజ్
ఇందులో 4-స్పీడ్ గేర్ బాక్స్ కలదు, ఇది మీకు లీటర్‌కు 76 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలదు. ఇది 112 కిలోల బరువును మోయగలదు..

ఫీచర్లు


పెద్దల కోసం
25 నుండి 35 సంవత్సరాల వయస్సున్న వారికి ఇది బాగా సరిపోతుందని తెలిపారు. ఎవరయితే మంచి మైలేజ్ మరియు చక్కటి పనితీరు కనబరిచే బైకు కోరుకుంటారో వారికి ఇది బాగా నప్పుతుంది.

తీర్పు
ప్రస్తుతం కాలంలో యువత మైలేజ్ ఇవ్వగల టూ వీలర్ల మీద కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నూతన శైలి గల టీవీఎస్ మనం చెల్లించే ధరకు తగ్గ బైకు అని మా నిర్ణయం.



Click it and Unblock the Notifications








