ఎనిమిది విభిన్న రంగుల్లో లభించనున్న టివియస్ వీగో
టివీఎస్ వారి మోస్ట్ పాపులర్ స్కూటర్ విగో ఇప్పుడు ఎనిమిది విభిన్న రంగుల్లో లభించనుంది. టివిఎస్ వారు ఇంతకు ముందే విగో అప్డేటేడ్ మోడల్‌ను పరిచయం చేశారు. అయితే విగోలోని ఇతర వేరియంట్లను నిలిపివేసి కేవలం ఒక్క వేరింయట్ను మాత్రమే 8 రంగుల్లో అందించనుంది.

ఇంతకు ముందు విగో లోని బ్రేకుల వలన ప్రమాదాల రేటు బాగా పెరిగిందని టివిఎస్ వారు ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ సరికొత్త విగోలో సింక్ బ్రేక్ టెక్నాలజీని ప్రవేశ పెట్టారు. తద్వారా ప్రమాదాలు జరిగే రేటు బాగా తగ్గుతుందని తెలిపారు. అంతే కాకుండా స్కిడ్ మరియు స్లిప్ వంటివి జరిగే అవకాశాలు చాలా వరకు తక్కుగా ఉంటాయని తెలిపారు. బ్రేకుల విషయం మినహాయిస్తే ఎటువంటి మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదు.
టివిఎస్ విగో లభించు ఎనిమిది విభిన్న రంగులు
- డీప్ స్కై బ్లూ
- మిడ్నైట్ బ్లాక్
- వొల్కానో రెడ్
- మెర్కురి గ్రే
- స్పోర్టి వైట్
- డ్యూయల్ టోన్ రెడ్
- డ్యూయల్ టోన్ బ్లూ
- డ్యూయల్ టోన్ వైట్
Also Read: 682 భోగీలు, 8 ఇంజన్లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు
ప్రస్తుతం టివిఎస్ విగో డ్రమ్ మరియు డిస్క్ బ్రేక్ ఆప్షన్లలో అందుబాటులో కలదు. డ్రమ్ బ్రేక్ వీగో స్కూటర్ ధర రూ. 56,891 మరియు డిస్క్ బ్రేక్ విగో స్కూటర్ ధర రూ. 59,796 ఎక్స్ షో రూమ్ (ముంబాయ్) గా ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా రే-జడ్, సుజుకి లెట్స్ మరియు హోండా వారి ఆక్టివా స్కూటర్లుకు పోటిగా నిలిచింది.
Also Read: హోండా సిబి హార్నెట్‌ను కేవలం రూ. 5,000 లకే బుక్ చేసుకోండి


Click it and Unblock the Notifications


















