4-స్ట్రోక్ మోపెడ్ ను కేవలం రూ. 29,539 లకు విడుదల చేసిన టీవీఎస్ టూ వీలర్స్
టీవీఎస్ మోటార్ సైకిల్స్ వారు దేశీయ మార్కెట్లోకి 1980 లో మొదటి సారిగా ఈ ఎక్స్ ఎల్ మోపెడ్ ను పరిచయం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా భారీ స్థాయిలో అమ్మకాలను సాధిస్తోంది.
Also Read: టీవీఎస్ అపాచే రీ ఎంట్రీ: డ్యూక్‌ను ఓవర్‌టేక్ చేయడం సాధ్యమేనా ?
అయితే టీవీఎస్ మోటార్ సైకిల్స్ వారు ఈ 2-స్ట్రోక్ మోపెడ్ ద్వారా 4-స్ట్రోక్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ ను అభివృద్ది చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

మొదట్ట మొదటిసారిగా 4-స్ట్రోక్ మోపెడ్ ను మార్కెట్లోకి విడుదల చేసిన టీవీఎస్ టూ వీలర్స్ వారు దీని ధర రూ. 29,539 లుగా నిర్ణయించారు.

అయితే ఈ 4-స్ట్రోక్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ ను ప్రస్తుతం కేవలం తమిళనాడు మార్కెట్లోకి మాత్రమే పరిచయం చేసినట్లు తెలిపారు. త్వరలో ఇతర రాష్ట్రాలలో కూడా దీనిని అందివ్వనున్నారు.

ఈ 4-స్ట్రోక్ మోపెడ్ లో టీవీఎస్ టూ వీలర్స్ వారు 99.7 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు.

టీవీఎస్ టూ వీలర్స్ వారు దీని అత్యధిక వేగాన్ని పరీక్షించిన తరువాత ఇది గరిష్టంగా గంటకు 67 కిలోమీటర్లతో పరుగులు పెడుతుందని తెలిపారు.

ఎక్స్ఎల్ సూపర్ 100 మోపెడ్ లో గరిష్ట వేగం గంటకు 60 కిలో మీటర్ల గా ప్రకటించారు.

టీవీఎస్ ఎక్స్ఎల్ వారి నూతన 4-స్ట్రోక్ మోపెడ్ లో నాలుగు లీటర్ల ఇంధన సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు.

ఈ మోపెడ్ మొత్తం 130 కిలోలు కలదు మరియు దాదాపుగా 75 కిలోల బరువును మోయగలుగుతుంది. అయితే ప్రస్తుతం దీనికి దేశీయ మార్కెట్లో ఎటువంటి పోటి లేదు.

ఈ సరికొత్త మోపెడ్ లో వెనుకవైపున నూతన షాక్ అబ్జార్వర్లను మరియు సరికొత్త ఎగ్జాస్ట్ టెయిల్ పైపు(సైలెన్సర్) ను అందించారు.

టీవీఎస్ మోటార్ సైకిల్స్ వారు ఈ మధ్యనే రెండు క్రొత్త టూ వీలర్స్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. వాటి గురించి మరిన్ని వివరాలు.


Click it and Unblock the Notifications








