యుఎమ్ మోటార్ సైకిల్స్ మాస్టర్ ప్లాన్: భారీ మోడళ్లతో మార్కెట్లోకి ఎంట్రీ

By Anil

యుఎమ్ మోటార్ సైకిల్స్ భారతీయ క్రూయిజ్ మోటార్ బైకుల సెగ్మెంట్లోకి తమ సరికొత్త రెనిగేడ్ కమాండో క్రూయిజ్ బైకులను డిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా రంగప్రవేశం చేసింది. కమాండో రెనిగేడ్ బైకులు రూ. 1.59 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనున్నాయి.

యుఎమ్ మోటార్ సైకిల్స్


రెనిగేడ్ కమాండో క్రూయిజ్ బైకు ధరలు:
యుఎమ్ మోటార్ సైకిల్స్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఇతర మోడళ్లు వాటి ధర వివరాలు
రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ ధర రూ. 1.49 లక్షలు
రెనిగేడ్ క్లాసిక్ ధర రూ. 1.69 లక్షలు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.
Also Read: బాలెనొ ఆర్‌ఎస్ తో కొత్త ప్రళయాన్ని సృష్టించనున్న మారుతి సుజుకి
రెనిగేడ్ బైకుల సాంకేతిక వివరాలు:
యుఎమ్ మోటార్ సైకిల్స్ ప్రవేశ పెట్టిన మూడు బైకులు కూడా 279సీసీ కెపాసిటి గల నీటితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 25 బిహెచ్‌పి పవర్ మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 21.8 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు బైకులు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌ను కలిగి ఉన్నాయి.
యుఎమ్ మోటార్ సైకిల్స్


అనుకూలతలు మరియు బ్రేకులు:
యుఎమ్ మోటార్ బైకులను రైడ్ చేస్తున్నప్పుడు మీకు సౌకర్యవంతంగా ఉండటానికి ఈ మూడు బైకులలో కూడా ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున రెండు షాక్ అబ్జార్వర్లను కల్పించారు. ఇక మూడు బైకులలో కూడా ముందు వైపున సింగల్ డిస్క్ బ్రేకులను మరియు వెనుకవైపున డ్రమ్ బేకులను అందించారు.
Also Read: యమహా ఎమ్‌టి-09 స్ట్రీట్‌ ఫైటర్: దీనిని కొనగల సత్తా ఉందా...?
డిజైన్ :
యుఎమ్ మోటార్ సైకిల్స్‌లోని కమాండో బైకు చూడటానికి పురాతణమైన దానిలా రూపొందించారు. ఈ మూడింటిలో కూడా హెడ్ లైట్లను ప్రత్యేకైన డిజైన్‌తో రూపొందించారు. వీటిని క్రింద గల ఫోటోల ద్వార గమనించగలరు. ఇక ముందు నుండి వెనక్కి వెల్లేసరికి స్మూత్‌గా తోక వంటి రూపం వచ్చేలా వీటి డిజైన్ ముగించారు. యుఎమ్ మోటార్ సైకిల్స్‌లోని రెనిగేడ్ కమాండో మరియు క్లాసిక్ బైకు స్పోక్స్ గల చక్రాలను మరియు రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ బైకులో అల్లాయ్ వీల్స్ కలవు.

అందుబాటులోకి మరియు పోటి:

యుఎమ్ మోటార్ సైకిల్స్‌కు చెందిన ఈ మూడు క్రూయిజ్ బైకులు కూడా ప్రస్తుతం అమ్మకాలకు పూర్తిగా సిద్దమయ్యాయి. మరియు ఈ మూడు బైకులు కూడా రాయల్ ఎన్పీల్డ్ వారి అన్ని బైకులకు మరియు ఈ మధ్యనే విడుదలైన హిమాలయన్ అడ్వెంచర్ టూరర్ బైక్‌కు కూడా పోటిగా నిలవనున్నాయి అని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 9, 2016, 12:43 [IST]
English summary
Renegade Commando Cruiser Leads UM Motorcycles's Raid Into India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+