ఇండియన్ మార్కెట్లోకి ఏడు కొత్త బైకులను విడుదల చేయనున్న బజాజ్

By Anil

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లో తమ ఉత్పత్తుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత పోటి ప్రపంచంలో ఉన్నతంగా ఎదగడానికి నూతన టెక్నాలజీతో నాణ్యమైన ఉత్పత్తులను అందించే దిశగా బజాజ్ ఆటో అడుగులు వేస్తోంది. ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఉన్న కమ్యూటర్, స్పోర్ట్స్ మరియు ఎక్జ్సిక్యూటివ్ సెగ్మెంట్ల ద్వారా అధిక మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

మార్కెట్లో ఉత్తమ టూ వీలర్ల తయారీ సంస్థగా ఎదగడానికి ప్రతి సెగ్మెంట్లో కూడా విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. అందుకోసం సుమారుగా ఏడు కొత్త ఉత్పత్తులను దేశీయంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. 2016-2017 మధ్య దేశీయంగా విడుదల కానున్న బజాజ్ వారి అన్ని బైకుల గురించి క్రింది కథనంలో.....

1. బజాజ్ అవెంజర్ 400

1. బజాజ్ అవెంజర్ 400

బజాజ్ ఇండియన్ మార్కెట్లోకి అవెంజర్ ఉత్పత్తులను అందించడం ద్వారా మళ్లీ విజయాన్ని పొందింది. దానిని అలాగే కొనసాగించేదుకు అవెంజర్ 400 ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం ఉన్న అవెంజర్ వాహనాల శ్రేణి 150సీసీ నుండి 220సీసీ మధ్య ఉన్నాయి. దీనిని ముఖ్యంగా అడ్వెంచర్ ప్రియులను ఉద్దేశించి రూపొందిస్తున్నారు.

అవెంజర్ 400 ఇంజన్, ధర మరియు విడుదల

అవెంజర్ 400 ఇంజన్, ధర మరియు విడుదల

బజాజ్ వారి అవెంజర్ 400 బైకు 375 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌తో రానుంది, ఇది సుమారుగా 43 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కెటిఎమ్‌తో పేరెంట్ సంస్థగా వ్యవహరిస్తున్న బజాజ్ ఈ అవెంజర్ 400 కోసం కెటిఎమ్ యొక్క సాంకేతిక వేదికను వినియోగించుకోనుంది.

ధర అచనా: రూ. 1.50 లక్షలు

విడుదల సమయం అంచనా: 2016 ఏడాది చివరి నాటికి

2. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 400 (ఎస్ఎస్400)

2. బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 400 (ఎస్ఎస్400)

బజాజ్ ఆటో మధ్య స్థాయి ధరలతో అందుబాటులో ఉండే స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లోకి ఈ ఆర్ఎస్ వేరియంట్‌కు కొన్ని కండలు తిరిగిన డీకాల్స్‌ను అందించి విడుదల చేయనుంది. గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఎస్ఎస్400 అనే కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఇది అచ్చం ఆర్ఎస్200 కు దగ్గరగా పోలికలతో ఉంటుంది. దీనినే బజాజ్ ఆర్ఎస్400 గా విడుదల చేయనుంది.

పల్సర్ ఆర్ఎస్400 ఇంజన్, ధర మరియు విడుదల

పల్సర్ ఆర్ఎస్400 ఇంజన్, ధర మరియు విడుదల

సరికొత్త పల్సర్ ఆర్ఎస్400 లో 375 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందిస్తున్నారు, ఇది సుమారుగా 43 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

ధర అచనా: రూ. 1.50 నుండి 2 లక్షలు

విడుదల సమయం అంచనా: 2016 ఏడాది చివరికి లేదా 2017 ప్రారంభానికి

3. బజాజ్ పల్సర్ సిఎస్400

3. బజాజ్ పల్సర్ సిఎస్400

సిఎస్ అనగా క్రూయిజర్ స్పోర్ట్ అని అర్థం, పల్సర్ శ్రేణి ఉత్పత్తులకు సరైన ఫ్లేవర్‌గా నిలిచే ఈ సిఎస్400 గురించి దేశ వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బజాజ్ వారి స్పోర్ట్స్ సెగ్మెంట్లో నిలకడగా అమ్మకాలు సాధించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది మార్కెట్ వర్గాల అంచనా.

పల్సర్ సిఎస్400 ఇంజన్, ధర మరియు విడుదల

పల్సర్ సిఎస్400 ఇంజన్, ధర మరియు విడుదల

బజాజ్ ఈ సిఎస్400 బైకులో 375 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందిస్తోంది, దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేస్తోంది. సరికొత్త డిజైన్ భాషలో ఈ సిఎస్400 బైకును రూపొందిస్తోంది బజాజ్.

ధర అచనా: రూ. 1.50 నుండి 1.75 లక్షలు

విడుదల సమయం అంచనా: జూలై-ఆగష్టు 2016

4. బజాజ్ సిఎస్200

4. బజాజ్ సిఎస్200

బజాజ్ ఆటో సిఎస్ వేరియంట్లో ఎక్కువ మరియు తక్కువ సామర్థ్యం (సీసీ)లతో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది, అందులో భాగంగానే ఈ సిఎస్200 ను పరిచయం చేస్తోంది.

సిఎస్200 ఇంజన్, ధర మరియు విడుదల

సిఎస్200 ఇంజన్, ధర మరియు విడుదల

బజాజ్ ఈ సిఎస్200లో 199.5 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందిస్తోంది, ఇది సుమారుగా 24.3 బిహెచ్‌పి పవర్ మరియు 18.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

ధర అచనా: రూ. 1.2 నుండి 1.5 లక్షలు

విడుదల సమయం అంచనా: 2016 ఏడాది చివరికి లేదా 2017 ప్రారంభానికి

5. బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

5. బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

ఇండియన టూ వీలర్ మార్కెట్లో అత్యంత ప్రభావవంతమైన సెగ్మెంట్లలో 150సీసీ ఒకటి. 150 సీసీ సెగ్మెంట్లో బలమైన ముద్ర వేసుకోవడానికి పల్సర్ 150ఎన్ఎస్ గా మార్కెట్‌కు రానుంది.

పల్సర్ 150ఎన్ఎస్ ఇంజన్, ధర మరియు విడుదల

పల్సర్ 150ఎన్ఎస్ ఇంజన్, ధర మరియు విడుదల

బజాజ్ ఈ పల్సర్ 150ఎన్ఎస్‌లో 149.5 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను అందిస్తోంది. ఇది 16.8 బిహెచ్‌పి పవర్ మరియు 13 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ధర అచనా: రూ. 70,000 నుండి 80,000

విడుదల సమయం అంచనా: 2016 ఏడాది చివరి నాటికి

6. బజాజ్ పల్సర్ 180ఎన్ఎస్

6. బజాజ్ పల్సర్ 180ఎన్ఎస్

150ఎన్ఎస్ మరియు 200ఎన్ఎస్ లైనప్‌లో బజాజ్ 180ఎన్ఎస్ ను అభివృద్ది చేస్తోంది. దీనికి పెరిమీటర్ ఫ్రేమ్ అనే డిజైన్ గల ఛాసిస్‌ను అందిస్తున్నారు. తద్వారా 200ఎన్ఎస్ మరియు 150ఎన్ఎస్‌ల కన్నా తక్కువ పరిమాణంలో ఉంటుంది.

 పల్సర్ 180ఎన్ఎస్ ఇంజన్, ధర మరియు విడుదల

పల్సర్ 180ఎన్ఎస్ ఇంజన్, ధర మరియు విడుదల

బజాజ్ ఈ పల్సర్ 180ఎన్ఎస్‍‌‌ కోసం 180 సీసీ ఇంజన్‌ను అభివృద్ది చేస్తోంది, ఇది సుమారుగా 19-21 మధ్య బిహెచ్‌పి పవర్ మరియు 16ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి 56-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

ధర అచనా: రూ. 75,000 నుండి 85,000

విడుదల సమయం అంచనా: 2016 ఏడాది చివరి నాటికి

7. బజాజ్ 2016 ప్లాటినా

7. బజాజ్ 2016 ప్లాటినా

కమ్యూటర్ సెగ్మెంట్లో ఉన్న ప్లాటినా బైకును సరికొత్త ఎడిషన్‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త బాడీ ప్యానెల్స్ మరియు కలర్ ఆప్షన్‌లో 2016 ప్లాటినాను అందించనుంది.

2016 ప్లాటినా ఇంజన్, ధర మరియు విడుదల

2016 ప్లాటినా ఇంజన్, ధర మరియు విడుదల

బజాజ్ ప్రస్తుతం ప్లాటినాలో ఉన్న 102 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను తిరిగి అందించనున్నారు, ఇది సుమారుగా 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ధర అచనా: రూ. 43,000 నుండి 45,000

విడుదల సమయం అంచనా: జూలై-సెప్టెంబర్ 2016

Article Published On: Thursday, June 16, 2016, 13:26 [IST]
English summary
Bajaj To Launch 7 New Bikes In 2016-17 — Here Is The List
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+