ఎక్స్‌ప్రెస్ రాజా(శర్వానంద్) చేతుల మీదుగా వెస్పా షోరూమ్ ప్రారంభం
ఎక్స్‌ప్రెస్ రాజాతో మంచి హిట్ కొట్టిన శర్వానంద్ తాజాగా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లో జరిగిన వెస్పా షోరూమ్ ప్రారంభ వేడుకల్లో కనువిందు చేశాడు. పియాజియో ఆధ్వర్యంలో ఉన్న వెస్పా సంస్థ భాగ్యనగరంలోని బంజారా హిల్స్‌లో తమ నూతన షోరూమ్‌ను ప్రారంభించింది.

వెస్పా టూ వీలర్ల సంస్థ స్టైల్, ఫ్యాషన్ మరియు అత్భుతమైన డిజైన్‌లతో ఎన్నో సంవత్సరాలుగా వెస్పా సంస్థ ఉత్పత్తులను అందిస్తున్నట్లు ఈ సంధర్బంగా తెలిపారు. ఈ షోరూమ్ ద్వారా వినయోగదారుల అవసరాలు మరియు నాణ్యమైన సేవలకు కట్టుబడి ఉంటామని తెలిపారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందుబాటులో గల అన్ని వెస్పా ఉత్పత్తులను బంజారాహిల్స్ లోని వెస్పా షోరూమ్ నందు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఐదు ఉత్పత్తులు కలవు. అవి విఎక్స్ 125, ఎస్ఎక్స్ఎల్125, ఎలిగాంట్, విఎక్స్ 150 మరియు ఎస్ఎక్స్ఎల్ 150 మోడల్స్
వెస్పా స్కూటర్స్ గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సరకొత్త అప్రిలియా ఎస్‌ఆర్-150 స్కూటర్‌ను ప్రదర్శించింది. దీనికి చెందిన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. వెస్పా అప్రిలియా ఎస్‌ఆర్-150 ఫోటోలు....


Click it and Unblock the Notifications























