ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన స్కూటర్
అసాధ్యాన్ని సుశాద్దం చేయడానికైనా, సుసాధ్యాన్ని అసాధ్యం చేయడానికైనా మాకు ఎవరు సాటిరారని నిరూపించారు వీరిద్దరూ. యుకె చెందిన డేవిడ్ ఆండర్సన్ మరియు మ్యాథ్యు హైన్ ఇద్దరూ కలసి రూపొందించిన ఒక మొబిలిటీ స్కూటర్‌ను గంటకు 173 కిలోమీటర్లు గిన్నిస్ రికార్డులో వారి పేర్లు లిఖించుకున్నారు.

ఇది ఎలా సాద్యం అని ఆశ్చర్యపోతున్నారా...? మీరే కాదు అలా ఆశ్చర్యపోవడం మా వంతు కూడా అయ్యింది. దీనికి గురించి తెలుసుకున్న వివరాలు అందరినీ ఔరా అనిపించాయి. వీరిద్దరూ కలిసి మొబిలిటీ స్కూటర్ కోసం కొన్ని విడి పరికరాలు సేకరించి వాటిని కలిపి స్కూటర్‌లాగా నిర్మించారు.
Also Read: లీటర్ పెట్రోల్‍తో 360 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల స్కూటర్
ఇందులో చలనశక్తి కోసం సుజుకి వారి బందిత్ 600 బైకులోని ఇంజన్‍ను వినియోగించారు. ఇంకేముంది ఏకంగా 600సీసీ కెపాసిటి గల ఇంజన్ ద్వారా దీనిని నడిపి అత్యంత వేగంగా పరుగులు పెట్టే మొబిలిటీ స్కూటర్‌గా గిన్నిస్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఆలోచన రావాలి అది ఆచరణకు నోచుకోవాలేగాని ప్రతి ఒక్కరూ సాధించగలరని వీరు నిరూపించారు.


Click it and Unblock the Notifications























