డిస్క్ బ్రేక్ మరియు సరికొత్త కలర్ ఆప్షన్‌లో యమహా ఆల్ఫా
యమహా మోటార్స్ ఇండియా సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త సిగ్నస్ ఆల్ఫా శ్రేణి స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జపాన్‌కు చెందిన ఈ ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం యమహా ఈ సిగ్నస్ ఆల్ఫా స్కూటర్‌ను డిస్క్ బ్రేక్ మరియు నూతన కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

2016 యమహా సిగ్నస్ ఆల్ఫా స్కూటర్ ధరలు:
యమహా సిగ్నస్ ఆల్ఫా డిస్క్ బ్రేకు వేరియంట్ ధర రూ. 52,556 లు
యమహా సిగ్నస్ ఆల్ఫా డిస్కే బ్రేక్ రహిత వేరియంట్ ధర రూ. 49,336 లు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
హోండా అమేజ్ అస్సలు కొనుగోలు చేయకండి.... కాదని కొంటే మీకు ఇదే గతి
సరికొత్త యమహా సిగ్నస్ ఆల్ఫా స్కూటర్ ఇప్పుడు డిస్క్ బ్రేకులో లభ్యం అవుతోంది. ఈ డిస్క్ బ్రేక్ ఆల్ఫా స్కూటర్లు రెండు కొత్త రంగులు రేడియంట్ క్యాన్ మరియు మార్వెల్ బ్లాక్ లలో అందుబాటులోకి వచ్చాయి. ముందు వైపున డిస్కే బ్రేకులు ఉన్న యమహా ఆల్ఫా వేరియంట్లలో మాత్రమే ఈ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

సాంకేతిక విశయాల పరంగా చూస్తే యమహా సిగ్నస్ ఆల్ఫా స్కూటర్‌లో బ్లూ కోర్ టెక్నాలజీతో తయారైన 113 సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 7.11 బిహెచ్‌పి పవర్ మరియు 8.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications