దీపావళికి ఎమ్‌టి 03 ని విడుదల చేయనున్న యమహా

By Anil

దేశ వ్యాప్తంగా జరుపునే దీపావళి పండుగకు ముందస్తుగా యమహా ఇండియా తమ ఎమ్‌టి 03 బైకును విడుదల చేయనున్నట్లు తెలిపింది. 50 శాతం యమహా ఆర్3 పోలికలతో ఉన్నటువంటి ఎమ్‌టి 03 ని దిగుమతి చేసుకుని పూర్తి స్థాయిలో అసెంబ్లింగ్ చేసి మార్కెట్లోకి అందివ్వనున్నారు.

యమహా ఎమ్‌టి 03

ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న ఎమ్‌టి 09 తో పాటుగా ఈ ఎమ్‌టి 03 ని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద యమహా ప్రదర్శించింది.

యమహా ఎమ్‌టి 03

సమచార వర్గాల కథనం మేరకు ఈ యమహా ఎమ్‌టి 03 బైకు ధర సుమారుగా రూ. 2.75 లక్షలుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

యమహా ఎమ్‌టి 03

సాంకేతికంగా ఇందులో 321సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

యమహా ఎమ్‌టి 03

ఈ యమహా ఎమ్‌టి 03 లోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 41.4బిహెచ్‌పి పవర్ మరియు 29.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ చేయును. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.

యమహా ఎమ్‌టి 03

ఈ ఎమ్‌టి 03 బైకు డిజైన్ పరంగా ఆర్3 ను పోలి ఉంటుంది. రైడింగ్ సౌలభ్యం కోసం ముందువైపున హ్యాండిల్‌ను కాస్త ఎత్తుగా ఉండే విధంగా అందించారు.

యమహా ఎమ్‌టి 03

ఈ ఎమ్‌టి 03 లో ముందు వైపు 110 సెక్షన్ మరియు వెనుక వైపున 140 సెక్షన్ ఉండే టైర్లను అందించారు.

యమహా ఎమ్‌టి 03

స్పోర్ట్స్ బైకులలో ఎంతో ముఖ్యమైనది సస్పెన్షన్. అందుకోసం ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్‌ను అందించారు.

యమహా ఎమ్‌టి 03

ఉత్తమ రహదారి పటిష్టం కోసం ఎమ్‌ఆర్ఎఫ్ టైర్ల స్థానంలో మిచేలియన్ లేదా పిరెల్లీ సంస్థలకు చెందిన ఖరీదైన టైర్లను వినియోగించనున్నారు. మరియు దేశీయంగా విడుదల చేసే ఎమ్‌టి 03 లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చే అవకాశాలు దాదాపుగా తక్కువే.

యమహా ఎమ్‌టి 03

యమహా ఇండియా ఈ ఎమ్‌టి 03 బైకును దేశీయ విపణిలోకి విడుదల చేస్తే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390, బెనెల్లీ టిఎన్‌టి300 మరియు త్వరలో విడుదల కానున్న బజాజ్ విఎస్400 లకు పోటీగా నిలవనుంది.

యమహా ఎమ్‌టి 03

యమహా ఎమ్‌టి 03

యమహా ఎమ్‌టి 03

  • ఒకే ఏడాదిలో విడుదల కానున్న షెవర్లే వారి ఐదు కొత్త కార్లు
  • సరికొత్త ఆకుపచ్చ రంగుల్లో యమహ సెల్యూటో
  • ఇండియా నుండి 10 ఇతర దేశాలకు ఉన్న రైలు మార్గాలు

Article Published On: Sunday, September 18, 2016, 11:30 [IST]
English summary
Read In Telugu: Yamaha Has An Interesting Motorcycle Launch Lined Up For Diwali
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+