యూరప్ నుండి భారత్‌కు యమహా ఎమ్‌టి-125
యమహా టూ వీలర్స్ భారతీయ మార్కెట్లోకి అతి తక్కువ సంఖ్యలో ఎమ్‌టి-125 స్ట్రీట్ ఫైటర్ మోటార్ బైకులను దిగుమతి చేసుకోనుంది. యూరోపియన్ మార్కెట్లో గల 125సీసీ సెగ్మెంట్లో దూసుకుపోతున్న ఎమ్‌టిు-125 మోటార్ సైకిల్స్‌ను భారత్‌కు ఏ కారణం చేత దిగుమతి చేసుకుంటున్నారో ఖచ్చితంగా తెలియదు గాని. భారత్‌లో దీనిని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం అని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎదైతేనేం ఎమ్‌టి-125 స్ట్రీట్ ఫైటర్ బైకు ఇండియాకు రాబోతోంది. అయితే దీని ప్రత్యేకతలేంటో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ శీర్షికను చదవాల్సిందే.

యమహా ఎమ్‌టి-125 స్ట్రీట్ ఫైటర్ బైకులో 124.7 సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

ఈ ఇంజన్ దాదాపుగా 14.7 బిహెచ్‌పి పవర్ మరియు 12.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులో గల శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. ముందు మరియు వెనుకవైపున డిస్క్ బ్రేకులను కల్పించారు.

యమహా ముందుగా ఈ ఎమ్‌టి-125 స్ట్రీట్ ఫైటర్ బైకులను దేశీయంగా అన్ని విధాలుగా పరీక్షించి తరువాత మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ నెలలో ఢిల్లీలో జరగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో మీకు గుర్తుకు ఉన్నట్లయితే యమహా మోటార్ సైకిల్స్ వారు ఎమ్‌టి-09 స్ట్రీట్ ఫైటర్ బైకును ప్రదర్శించింది. అనగా నెమ్మదిగా ఎమ్‌టి శ్రేణి ద్విచక్ర వాహనాలను భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చే దోరణిలో ఉందనిపిస్తోతోంది.

అయితే ఎమ్‌టి-15 మరియు ఎమ్‌టి-03 వంటి మోడళ్లను ప్రవేశ పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

జపాన్‌కు చెందిన యమహా ద్విచక్ర వాహనాల సంస్థ దేశీయంగా ఎమ్‌టి-125 బైకులను తయారుచేసి అంతర్జాతీయ మార్కెట్లో దీని ప్రభావం ఉన్న దేశాలలో అమ్మకాలు చేపట్టాలని చూస్తోంది.

- ఆశ్చర్యం కలిగించే ధరతో విడుదలైన 150సీసీ బజాజ్ వి15 బైకు
- రెనో క్విడ్ కారు ఆవిష్కరణ వెనకున్న.... ఆసక్తికరమైన సమాచారం !


Click it and Unblock the Notifications