యమహా ఆర్3 రీకాల్: మీ బైకు కూడా ఇందులో ఉందేమో చూడండి
యమహా మోటార్ సైకిల్స్ ఇండియాలో ఆర్3 బైకులను రీకాల్ చేసినట్లు అధికారకంగా ప్రకటించారు. రీకాల్‌కు సంభందించిన కారణం క్లచ్‌లోని ప్లెసర్ ప్లేటులోని అమరిక మరియు ఆయిల్ పంపు అమరిక సరిగా లేనందు వలన సుమారుగా 903 యూనిట్ల ఆర్3 బైకులను రీకాల్ చేసినట్లు తెలిపారు.

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి అందించిన వైజడ్‌ఎఫ్-ఆర్3 ఇకానిక్ బైకు ఎంతో విజయవంతమైంది. ఇండియాలో విడుదలైన ఆర్3 బైకులలో క్లచ్ లోని ప్రెసర్ ప్లేటు మరియు ఆయిల్ పంపు అమరిక వంటి తప్పులు దొర్లాయి. ఈ కారణంగా వీటిని రీకాల్ చేసినట్లు ప్రకటించారు.
అక్కినేని ఫ్యామిలీ కార్ కలెక్షన్
అయితే ఇంత వరకు ఈ రెండు కారణాల వలన యమహా వైజడ్‌ఎఫ్-ఆర్3 బైకులు ప్రమాదానికి గరికాలేదు. అయినప్పటికీ యమహా మోటార్ సైకిల్స్ సంస్థ భాద్యత గల కార్పోరేట్ సంస్థగా రీకాల్‌ను ప్రకటించింది.
మొత్తం 902 బైకులను రీకాల్ చేశారు. వినియోగదారులు ఇలాంటి సమస్యను గుర్తించినా లేదా ముందస్తుగా సమీప యమహాను సంప్రదించి వాటిని మర్పించుకోవచ్చు. దీనిని షోరూమ్ నిర్వాహకులను ఉచితంగా నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు సంభందిత యమహా షోరూమ్ అధీకృత డీలర్‌ను సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications