ఇండియన్ మార్కెట్లోకి యమహా సెల్యూటో ఆర్‌ఎక్స్ విడుదల ధర రూ. 46,400 లు
యమహా మోటార్ సైకిల్స్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సెల్యూటో ఆర్‌ఎక్స్ 110 సీసీ మోటార్ సైకిల్‌ను 46,400 రుపాయలకు విడుదల చేసింది. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేసినట్లు తెలిపారు.
యమహా సెల్యూటో ఆర్‌ఎక్స్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్ వివరాలు
యమహా మోటార్ సైకిల్స్ ఈ సెల్యూటో ఆర్ఎక్స్ బైకులో 110సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.

పవర్ మరియు టార్క్
ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 7.3 బిహెచ్‌పి పవర్ మరియు 8.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్
ఇందులోని ఇంజన్ విడుదల చేయు పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు చేరవేయడానికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసందానం చేశారు. మరియు ఇది లీటర్‌కు 82 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

ఫీచర్లు
- ఇందులో 125సీసీ వేరియంట్‌ను పోలి ఉండే డిజైన్‌ను కల్పించారు
- ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్
- వెనుక వైపున రెండు షాక్ అబ్జార్వర్లు
- 17-అంగుళాల అల్లాయ్ వీల్స్
- టూబ్‌లు గల టైర్లు
- రెండు వైపుల డ్రమ్ బ్రేకులు
- ఎలక్ట్రిక్ స్టార్ట్
- 7.2-లీటర్ల ఇంధన సామర్థ్యం ఉన్న ట్యాంక్
- మరియు యమహా సెల్యూటో ఆర్‌ఎక్స్ 98 కిలోల బరువు కలదు.
- బ్రీజి బ్లూ
- మ్యాట్ బ్లాక్
- ఇన్‌స్పైరింగ్ రెడ్
- గ్లేమింగ్ బ్లాక్

ఫీచర్లు

పోటి
యమహా సెల్యూటో ఆర్‌ఎక్స్ బైకు టీవీఎస్ వారి నూతనంగా విడుదల చేసిన విక్టర్, మహీంద్రా సెంచ్యురో, హోండా డ్రీమ్ యుగ మరియు ఇండియన్ మార్కెట్లో 110 సీసీ సెగ్మెంట్లో బైకులకు ఇది పోటిగా నిలవనుంది.

లభించు రంగులు
యమహా సెల్యూటో ఆర్‌ఎక్స్ ప్రస్తుతం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.

సరికొత్త టీవీఎస్ విక్టర్ - టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
స్కూటర్ల వార్: సుజుకి యాక్సెస్ 125 Vs హోండా ఆక్టివా 125 Vs మహీంద్రా గస్టో 125
యూరో ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో సింగిల్ స్టార్ రేటింగ్ పొందిన బజాజ్ క్యూట్


Click it and Unblock the Notifications