2017 హోండా సిబి షైన్ విడుదల: ధర రూ. 55,799 లు
హోండా విపణిలోకి 2017 సిబి షైన్ బైకును విడుదల చేసింది. ఇందులో నూతన బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ అందివ్వడం జరిగింది.
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2017 సిబి షైన్ ను విపణిలోకి విడుదల చేసింది. దీనికి బాడీ డీకాల్స్ మీద స్వల్ప కాస్మొటిక్ మెరుగులతో పాటు, బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌ను జోడించడం జరిగింది.

హోండా టూ వీలర్ల సంస్థ ఈ 2017 షైన్ కు కొన్ని కాస్మొటిక్ మెరుగులు అద్దింది, ఇందులో ఎగ్జాస్ట్ గొట్టం మీద మరియు కార్బోరేటర్ మీద క్రోమ్ కవర్ అందివ్వడం జరిగింది.

అంతే కాకుండా దీనిని ఏడు విభిన్న రంగుల్లో విడుదల చేసింది. అవి, బ్లాక్, మ్యాపిల్ బ్రౌన్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్, రెబల్ రెడ్, స్పోర్ట్స్ రెడ్, పర్ల్ అమేజింగ్ వైట్ మరియు అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ వంటి రంగులు...

సాంకేతికంగా ఇందులో 124.73సీసీ సామర్థ్యం గల బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అందివ్వడం జరిగింది.

4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 10.16బిహెచ్‌పి పవర్ మరియు 10.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇందులో విశాలమైన ట్యూబ్ లెస్ టైర్లు, రెండు చక్రాలకు డ్రమ్ బ్రేకులు. ముందు వైపున 240ఎమ్ఎమ్ చుట్టు కొలత డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. సరికొత్త షైన్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ను కూడా కలిగి ఉంది.

హోండా తమ షైన్ లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 5-లెవల్స్ వరకు అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రియర్ సప్సెన్షన్ అందించింది. 10.3 లీటర్ల స్టోరేజి సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు గల ఇందులో 157ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ కలదు.

2017 సిబి షైన్ ధరలు
- డ్రమ్ వేరియంట్ ధర రూ. 55,799 లు
- డిస్క్ వేరియంట్ ధర రూ. 58,125 లు
- సిబిఎస్ వేరియంట్ ధర రూ. 61,047 లు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

న్యూ జనరేషన్ వ్యాగన్ ఆర్: రూపు రేఖలన్ని మార్చేశారు...!!
హీరో నుండి రూ. 19,990 లకే ఎలక్ట్రిక్ స్కూటర్


Click it and Unblock the Notifications








