హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు పూర్తి వివరాల కోసం

Written By:

హోండా సిబిఆర్ 650ఎఫ్ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ సరికొత్త 2017 హోండా సిబిఆర్ 650ఎఫ్ బైకును రూ. 7.30 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విపణిలోకి ప్రవేశపెట్టింది.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వచ్చిన 2017 హోండా సిబిఆర్ 650ఎఫ్ బైకులో కాస్మొటిక్ మరియు మెకానికల్ పరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల

2017 హోండా సిబిఆర్ 650ఎఫ్ బేసిక్ డిజైన్ మొత్తం మునుపటి వెర్షన్‌ డిజైన్‌నే పోలి ఉంటుంది. అయితే కాస్త అగ్రెసివ్ డిజైన్ శైలిలో తీర్చిదిద్దింది.

బైక్ ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న సరికొత్త ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ చాలా విభిన్నంగా ఉంటుంది. పదునైన డిజైన్‌ లక్షణాలతో ఉన్న 2017 సిబిఆర్ 650ఎఫ్ బైకును మిల్లేనియం రెడ్ మరియు మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు.

హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల

నూతన 2017 హోండా సిబిఆర్ 650ఎఫ్ మోటార్ సైకిల్‌లో లిక్విడ్‌తో చల్లబడే 649సీసీ సామర్థ్యం గల ఇన్ లైన్ నాలుగు సిలిండర్ల డిఒహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 86బిహెచ్‌పి పవర్ మరియు 60ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల

స్పోర్ట్ టూరింగ్ సెగ్మెంట్లో ఉన్న సిబిఆర్ 650ఎఫ్ బైకులో అత్యంత శక్తివంతమైన ఇంజన్ కలదు. అయితే, సింగల్ ఎగ్జాస్ట్ పైపు మాత్రమే ఉంది. నాలుగు సిలిండర్ల ఇంజన్ గల బైకులో సింగల్ టెయిల్ రావడం నమ్మశక్యంగా లేదు. కానీ, మునుపటిలా ఎగ్జాస్ట్ సిస్టమ్ అంతర్భాగంలో ఉన్న ట్రిపుల్ పాస్‌కు బదులుగా డ్యూయల్ పాస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అందివ్వడం జరిగింది.

హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల

హోండా సిబిఆర్ 650ఎఫ్ బైకులో ముందు వైపున 41ఎమ్ఎమ్ షోవా డ్యూయల్ బెండింగ్ వాల్వ్స్ ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 7-దశలలో స్ప్రింగ్ ప్రిలోడ్ అడ్జెస్ట్‌మెంట్ గల మోనోషాక్ అబ్జార్వర్ కలదు. నూతన సస్పెన్షన్ సిస్టమ్ అత్యుత్తమ రైడింగ్, హ్యాండ్లింగ్‌తో పాటు తక్కువ బరువుతో నిర్మించడానికి సాధ్యమైంది.

హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల

స్పోర్ట్స్ బైకులో పవర్ ఫుల్ ఇంజన్‌తో వాటి దాన్ని వేగాన్ని అదుపు చేయడానికి అంతే చురుకైన బ్రేకింగ్ సిస్టమ్ ఉండాలి. 2017 హోండా సిబిఆర్ 650ఎఫ్ లో ముందు వైపున 320ఎమ్ఎమ్ డ్యూయల్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక చక్రానికి 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, సరికొత్త సిబిఆర్650ఎఫ్ సిబిఆర్ సిరీస్‌లో డిజైన్ మరియు స్టైల్ పరంగా అత్యుత్తమ ఎంపిక కానుంది. స్పోర్టివ్ స్టైల్ మరియు శక్తివంతమైన 4-సిలిండర్ల ఇంజన్‌ కాంబినేషన్ రైడర్లలో మరింత ఉత్సుకతను నింపుతుందని చెప్పుకొచ్చాడు."

హోండా సిబిఆర్ 650ఎఫ్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త హోండా సిబిఆర్ 650ఎఫ్ టూరింగ్ స్పోర్ట్ శ్రేణిలో ధరకు తగ్గ విలువను కలిగి ఉంది. శక్తివంతమైన ఇంజన్, అప్‌డేటెట్ డిజైన్, బెటర్ సస్పెన్షన్, అధునాతన ఫీచర్లు వంటివి దీనిని మరింత ప్రత్యేకం చేస్తాయి.

English summary
Read In Telugu: 2017 Honda CBR 650F Launched In India; Prices Start At Rs 7.30 Lakh
Story first published: Wednesday, October 11, 2017, 10:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark