2017 కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 బ్రౌచర్ లీక్...

Written By:

2017 లో విడుదల కానున్న కెటిఎమ్‌ ఆర్‌సి390 మరియు 2017 కెటిఎమ్‌ ఆర్‌సి200 మోడళ్లకు చెందిన బ్రోచర్లు లీక్ అయ్యాయి వాటి ఆధారంగా ఈ రెండు మోటార్ సైకిళ్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు...

లీక్ అవ్వడం మరియు ఫైరసీ వంటి వాటిని ఎక్కువగా సినిమా పరిశ్రమలో వింటూ ఉంటాం. ఎంత గోప్యంగా ఉంచినప్పటికీ ఎలాగోలా బయటపడుతుంటాయి. ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఆటోమొబైల్ పరిశ్రమను కూడా వెంటాడుతోంది.

ఆస్ట్రియన్‌కు చెందిన కెటిఎమ్ మోటార్ సైకిల్స్ యొక్క బైకులకు దేశీయంగా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు దేశీయంగా అధిక ఉత్పత్తులను విడుదల చేసి తమ లైనప్‌ను మరింత బలంగా మార్చుకోనుంది. ఇందుకు ఈ ఏడాది ఆర్‌సి390 మరియు ఆర్‌సి 200 లను విడుదల చేయనుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌ను వేదికగా చేసుకుని లీకయినా బ్రౌచర్ల ప్రకారం సరికొత్త ఆర్‌సి 390 మరియు ఆర్‌సి200 బైకుల యొక్క విడుదల వివరాలు ఆవిష్కృతమయ్యాయి.

2017 కు చెందిన ఆర్‌సి390 మోడల్ మెకానికల్‌గా మార్పులకు గురికాగా, ఆర్‌సి200 వేరియంట్ ఎలాంటి మార్పులకు గురికాకుండా అవే మునుపటి సాంకేతిక అంశాలతో రానుంది.

2017 కెటిఎమ్ ఆర్‌సి390 లో చోటు చేసుకున్న మెకానికల్ మార్పుల ప్రకారం, స్లిప్పర్ క్లచ్, ఆఫ్ ఆన్ చేసుకునే అవకాశం ఉన్న యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రైడ్ బై వైర్ టెక్నాలజీ మరియు ముందు వైపున 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

ఇందులో ఉన్న బాగా గుర్తించదగిన మార్పులలో ఇంజన్ క్రింది భాగంలోనే ఉన్న అప్‌స్వెప్ట్ క్యానిస్టర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. మునుపటిలా పొడవాటి ఎగ్జాస్ట్ గొట్ట స్థానంలో దీనిని పరిచయం చేయడం జరిగింది.

సాంకేతికంగా 2017 కెటిఎమ్ ఆర్‌సి390 మోటార్ సైకిల్‌లో లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. యూరో-4 ఉద్గార నియమాలను పాటించే ఇది 43బిహెచ్‌పి పవర్ మరియు 36ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు అందుతుంది. ముందు వైపున 320 మరియు వెనుక వైపున 230ఎమ్ఎమ్ చుట్టుకొలత డిస్క్ బ్రేకులు, మరియు బాష్ సంస్థ నుండి సేకరించిన యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ పరిచయం చేయడం జరిగింది.

ఇక 2017 కెటిఎమ్ ఆర్‌సి200 విషయానికి వస్తే ఇందులో పై పై మెరుగులు తప్పిస్తే సాంకేతికంగా ఏ విధమైన మార్పులు చోటు చోసుకోలేదు.

బడ్జెట్ ధరతో 2017 లో విడుదల కానున్న స్పోర్టివ్ బైకులు
బడ్జెట్ ధరతో 2017 లో విడుదల కానున్న స్పోర్టివ్ బైకులు
2017 లో విడుదల కానున్న ఉత్తేజకరమైన బైకుల గురించి మరియు అంచనాతో విడుదల , ధర వివరాలు మీ కోసం....

 

కెటిఎమ్ అతి త్వరలో విడుదల చేయనున్న 2017 కెటిఎమ్ ఆర్‍‌సి 390 బైకును క్రింద గల గ్యాలరీని క్లిక్ చేసి నిశితంగా పరిశీలించండి...
 

English summary
2017 KTM RC390 And RC200 Brochure Leaked Ahead Of Launch
Story first published: Monday, January 9, 2017, 15:57 [IST]
Please Wait while comments are loading...

Latest Photos