TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
2018 కవాసకి వెర్సేస్ 650 విడుదలరూ. 6.50 లక్షలు
కవాసకి ఇండియన్ మార్కెట్లోకి 2018 కవాసకి వెర్సేస్ 650 బైకును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త కవాసకి వెర్సేస్ 650 ప్రారంభ ధర రూ. 6.50 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.
దేశవ్యాప్తంగా ఉన్న కవాసకి విక్రయ కేంద్రాలలో 2018 మోడలో వెర్సేస్ 650 మోటార్ సైకిల్ మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మరి కొన్ని వారాల్లో డెలివరీలు షురూ కానున్నాయి. 2018 కవాసకి వెర్సేస్ 650 బైక్ గురించి పూర్తి వివరాలు....
2017 మోడల్‌తో పోల్చుకుంటే సరికొత్త 2018 కవాసకి వెర్సేస్ బైకులో బాడీ గ్రాఫిక్స్ మినహాయిస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
వెర్సేస్ 650 అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్‌లో 2017 మోడల్ తరహా అదే గ్రీన్ మరియు బ్లాక్ కలర్ స్కీమ్, అడ్జెస్టబుల్ విండ్ స్క్రీన్ మరియు డిజిటల్ గేర్ పొజిషన్ ఇండికేటర్ గల ఇంస్ట్రుమెంట్ కన్సోల్ ఇందులో యథావిధిగా వచ్చాయి.
2018 కవాసకి వెర్సేస్ 650 బైకులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులోని శక్తివంతమైన 649సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ 68బిహెచ్‌పి పవర్ మరియు 64ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.
కవాసకి వెర్సేస్ బైకులో అత్యధిక ధృడత్వమున్న స్టీల్‌తో నిర్మించిన డైమండ్ ఫ్రేమ్ కలదు. సస్పెన్షన్ కోసం ముందు వైపున 41ఎమ్ఎమ్ ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు మోనోషాక్ అబ్జార్వర్ కలదు. ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్‌ను అవసరానికి తగ్గట్లుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున రెండు 300ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ సపోర్ట్ గల 250ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది. 17-అంగుళాల పరిమాణం గల రెండు చక్రాలకు 120/70 ZR17 M/C (ముందు), 160/60 ZR17 M/C (వెనుక వైపు) కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మిడ్ సైజ్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో ఉన్న తమ వెర్సేస్ 650 బైకును స్వల్ప మార్పులు నిర్వహించిన 2018 వెర్షన్‌లో లాంచ్ చేసింది. 2017 మరియు 2018 వెర్షన్ మద్య ఉన్న ఏకైక తేడా కలర్ ఆప్షన్, అప్‌డేటెడ్ కలర్ ఆప్షన్ మినహాయిస్తే ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఎప్పటికప్పుడు రీప్రెష్డ్ మోడళ్లను అందుబాటులో ఉంచే ఉద్దేశ్యంతో కవాసకి 2018 వెర్సేస్ 650ను ప్రవేశపెట్టింది.