రాయల్ ఎన్ఫీల్డ్ మీద పోటీకి సిద్దమైన మహీంద్రా

హీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా తొలి ఇకానిక్ బ్రాండ్ బిఎస్ఎ మోటార్ సైకిల్ తొలి మోడల్ తయారీ మీద పనిచేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా దిగ్గజ బ్రిటీష్ మోటార్ సైకిల్ బ్రాండ్ బిఎస్ఎ సంస్థను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి డ్రైవ్‌స్పార్క్ ఓ కథనం కూడా ప్రచురించి. పాత కాలపు మోటార్ సైకిళ్లకు ప్రసిద్దిగాంచిన బిఎస్ఎ సంస్థ శాస్వతంగా కార్యకలాపాలు నిలిపివేయడంతో మహీంద్రా దీనిని శాశ్వతంగా సొంతం చేసుకుంది.

మహీంద్రా క్లాసిక్ బైకులు

ఇప్పుడు, మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా తొలి ఇకానిక్ బ్రాండ్ బిఎస్ఎ మోటార్ సైకిల్ తొలి మోడల్ తయారీ మీద పని చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని, బిఎస్ఎ మోటార్ సైకిల్ పాత అడ్వర్టైజ్‌మెంట్ ఫోటో ఆధారంగా బిఎస్ఎ బైకును రైడ్ చేస్తున్న శాంటాను ఉద్దేశించి మహీంద్రా ఈ పాత కాలపు బైకును నూతన సొబగులతో మళ్లీ లాంచ్ చేస్తున్నట్లు తెలిపాడు

మహీంద్రా క్లాసిక్ బైకులు

అంటే, అవే డిజైన్ అంశాలతో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బిఎస్ మోటార్ సైకిల్ బ్రాండ్ క్రింద క్లాసిక్ స్టైల్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయనుంది. అయితే, మరే ఇతర వివరాలు వెల్లడించలేదు.

Recommended Video

Royal Enfield Stealth Black Classic 500 Apparels Now On Sale - DriveSpark
మహీంద్రా క్లాసిక్ బైకులు

అక్టోబర్ 2016లో మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటన్ మోటార్ సైకిల్ దిగ్గజం బిఎస్ఎ బ్రాండ్‌‍ను 28 కోట్ల రుపాయలతో సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అప్పట్లో మహీంద్రా నార్టన్ మోటార్ సైకిల్స్‌ను కొనుగోలు చేయాలని చూసింది. అయితే, బిఎస్ఎ డీల్ కుదుర్చుకుంది.

Trending On DriveSpark Telugu:

మిలిటరీ గ్రీన్ కలర్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

మరో సంచలనాత్మక బైకును విడుదలకు సిద్దం చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

హ్యుందాయ్‌, మారుతికి దిమ్మతిరిగే షాకిచ్చిన వోక్స్‌వ్యాగన్

మహీంద్రా క్లాసిక్ బైకులు

బిఎస్ఎ కంపెనీ లిమిటెడ్‌ సంస్థను తన భాగస్వామ్యపు సంస్థ అయిన క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్(CLPL) ద్వారా 100 శాతం వాటాను కొనుగోలు చేసిన మహీంద్రా సొంతం చేసుకుంది. ఒప్పందం కుదిరిన వెంటనే, బిఎస్ఎ మోటార్ సైకిళ్ల ఉత్పత్తి ఇండియాలో జరగదు, మరియు ఇప్పట్లో వాటిని లాంచ్ చేసే ఆలోచన లేనట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

మహీంద్రా క్లాసిక్ బైకులు

బిఎస్ఎ మరియు జావా మోటో బ్రాండ్లను సొంతం చేసుకోవడంతో, ఎంట్రీ లెవల్ టూ వీలర్లకు స్వస్తి పలికి ఎక్కువ కెపాసిటి గల ప్రీమియమ్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తామని మహీంద్రా వెల్లడించింది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే జావా మోటార్ సైకిళ్లను ఇండియాలోనే తయారు చేయనుంది. తొలి ప్రొడక్షన్‌ను 2018 చివరి నుండి ప్రారంభం కానుంది.

మహీంద్రా క్లాసిక్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఇప్పటి వరకు ప్రవేశించని వాహన శ్రేణంటూ ఏదీ లేదు. టూ వీలర్లు, కార్లు, ట్రక్కు, లారీలు, బస్సులు, బోట్లు, విమానాల వరకు అన్ని రకాల వాహన రంగంలోకి ప్రవేశించింది. ప్రతి సెగ్మెంట్లో తనదైన ముద్రను వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నస్తోంది.

మహీంద్రా క్లాసిక్ బైకులు

అందులో భాగంగానే క్లాసిక్ మోటార్ సైకిల్ మార్కెట్లో రాణించేందుకు బిఎస్ఎ మోటార్ సైకిళ్ల సంస్థను సొంతం చేసుకుంది. అమెరికా, ఇటలీ మరియు ఇంగ్లాడ్ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా ప్రవేశించేందుకు భారీ ప్రణాళికలు వేసుకుంది.

మహీంద్రా క్లాసిక్ మోటార్ సైకిళ్లను పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తే విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్, ట్రయంప్, డుకాటి మరియు నార్టన్ వంటి సంస్థల ఉత్పత్తి చేస్తున్న క్లాసిక్ బైకులతో పోటీపడనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Anand Mahindra Confirms New BSA Motorcycle In The Works
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X