సరికొత్త కలర్ ఆప్షన్‌లో బజాజ్ డామినర్ 400

బజాజ్ ఆటో తమ డామినర్ 400 లో కొత్త కలర్ స్కీమ్ పరిచయం చేసింది. అప్‌డేటెడ్ స్పోర్ట్స్ క్రూయిజ్ మోటార్ సైకిల్ డామినర్ 400 ను ఇప్పుడు మ్యాట్ బ్లాక్ షేడ్ కలర్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

By Anil

బజాజ్ ఆటో తమ డామినర్ 400 లో కొత్త కలర్ స్కీమ్ పరిచయం చేసింది. అప్‌డేటెడ్ స్పోర్ట్స్ క్రూయిజ్ మోటార్ సైకిల్ డామినర్ 400 ను ఇప్పుడు మ్యాట్ బ్లాక్ షేడ్ కలర్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

బజాజ్ డామినర్ 400 మ్యాట్ బ్లాక్ షేడ్ కలర్

కొత్త కలర్ స్కీమ్ పరిచయం మినహాయిస్తే, ఈ మోటార్ సైకిల్‌లో ఎలాంటి కాస్మొటిక్ మరియు మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం డామినర్ 400 బైకును మిడ్ నైట్ బ్లూ, ట్విలైట్ ప్లమ్, మూన్ లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లతో పాటు మ్యాట్ బ్లాక్ షేడ్‌లో ఎంచుకోవచ్చు.

బజాజ్ డామినర్ 400 మ్యాట్ బ్లాక్ షేడ్ కలర్

స్పోర్ట్స్ క్రూయిజ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి బజాజ్ విడుదల చేసిన డామినర్ 400 బైకులో 373సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 35బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ డామినర్ 400 మ్యాట్ బ్లాక్ షేడ్ కలర్

1.8 నుండి 2 లక్షల మధ్య ఆన్ రోడ్ ధరల శ్రేణిలో ఉన్న డామినర్ 400 ను నెలకు 3,500 యూనిట్ల వరకు బజాజ్ విక్రయిస్తోంది. మే మరియు జూన్ నెలలో సేల్స్ స్వల్ప మేర తగ్గాయని తెలిపింది. జిఎస్‌టి మీద కస్టమర్లలో నెలకొన్న అపోహలే ఇందుకు కారణం, జిఎస్‌టి పూర్తి స్థాయిలో అమలైతే విక్రయాలు యథావిధిగా ఉంటాయని బజాజ్ ధీమా వ్యక్తం చేసింది.

బజాజ్ డామినర్ 400 మ్యాట్ బ్లాక్ షేడ్ కలర్

మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభించే డామినర్ 400 లిమిటెడ్ ఎడిషన్ కాదని, పూర్తి స్థాయిలో మిగతా కలర్ ఆప్షన్‌లతో పాటే అందుబాటులో ఉంటుందని బజాజ్ పేర్కొంది. సాధారణ కలర్ ఆప్షన్‌లతో పోల్చుకుంటే దీని ధర రూ. 4,000 వరకు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బుక్ చేసుకున్న రెండు రోజుల్లో డెలివరీ ఇస్తామని బజాజ్ డీలర్లు పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, June 29, 2017, 13:51 [IST]
English summary
Read In Telugu Bajaj Dominar 400 Matte Black Hits Showrooms
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+